● కామారెడ్డి మున్సిపల్ చైర్‌పర్సన్ ఉమారాణి
● ‘సాక్షి’ ఫోన్‌ఇన్ ఫిర్యాదులపై
క్షేత్రస్థాయిలో పరిశీలన
కామారెడ్డి టౌన్ : అన్ని వార్డులలో ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని మున్సిపల్ చైర్‌పర్సన్ ఇ ప్ప ఉమారాణి పేర్కొన్నారు. ఇటీవల ‘సాక్షి’ ఆధ్వర్యంలో నిర్వహించిన ఫోన్‌ఇన్ కార్యక్రమంలో వచ్చిన ఫిర్యాదులపై ఆమె స్పందించారు. గురువారం మున్సిపల్ కమిషనర్ పర్వతాలు, ఏఈ వేణుప్రసాద్‌తో కలి సి పలు వార్డుల్లో పర్యటించారు. ఫిర్యాదుదారులు, స్థానిక కాలనీవాసులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. ఉదయం పాత రాజంపేట్‌లో తాగునీటి పైప్‌లైన్ లీకేజీలను పరిశీలించి, వాటిని తక్షణమే అరికట్టాలని ఏఈని ఆదేశించారు. అనంతరం షబ్బీర్ కా లనీలో సమస్యలను తెలుసుకున్నారు. 19వ వార్డు ముదిరాజ్ సంఘ భవనం ముందు గోదావరి జలాల పైప్‌లైన్ లీకేజీలను పరిశీలించారు. నీటి వృథా, పను ల్లో నిర్లక్ష్యంపై సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
సిబ్బందిపై అసహనం..
43వ వార్డులో వాటర్ స్టార్మ్ డ్రైయిన్‌ను పరిశీలించారు. మురికి కాలువ ప్రమాదకరంగా ఉందని, తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని, ఇటీవల మున్సిపల్ కార్మికులే కాలువలో పడిపోయారని కాలనీవాసులు పేర్కొన్నారు. దీనిపై స్పందించిన చైర్‌పర్సన్.. ఎమర్జెన్సీ నిధుల కింద పనులు చేపడతామని హామీ ఇచ్చారు. శుభ్రత లోపించడం, పగటి పూట కూడా వీధిదీపాలు వెలుగుతుండడంపై అసహనం వ్యక్తం చేశారు. నిర్లక్ష్యం వహించిన సిబ్బంది వేతనాలు నిలిపివేయాలని అధికారులను ఆదేశించారు. వార్డు సమస్యలను కౌన్సిలర్ వంశీకృష్ణ చైర్‌పర్సన్‌కు వివరించారు. సమస్యలను నేరుగా చైర్‌పర్సన్, అధికారుల దృష్టికి తీసుకెళ్లే అవకాశం కల్పించిన ‘సాక్షి’కి ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు.


