బాన్సువాడ రూరల్: పేదింటి ఆడబిడ్డల పెళ్లికి ప్రభుత్వం అమలు చేస్తున్న కల్యాణలక్ష్మి, షాదీమూబారక్ పథకాలు వరంలా మారాయని ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. గురువారం బాన్సువాడలోని తన నివాసంలో బాన్సువాడ పట్టణం, బాన్సువాడ రూరల్, నస్రుల్లాబాద్ మండలాలకు చెందిన 173 మందికి మంజూరైన కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. తహసీల్దార్ నరేందర్‌గౌడ్, నాయకులు గురువినయ్, కాసుల రోహిత్, అలీమోద్దీన్‌బాబా, హకీం, నారాయణరెడ్డి, ఉద్దర రాజు, వీరేశం, మన్నె రమేష్, కమటాల శ్రీనివాస్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.


