చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దు | - | Sakshi
Sakshi News home page

చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దు

May 15 2026 10:26 AM | Updated on May 15 2026 10:26 AM

చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దు

బక్రీద్‌కు కట్టుదిట్టమైన ఏర్పాట్లు

ఎస్పీ రాజేష్‌ చంద్ర

కామారెడ్డి క్రైం: బక్రీద్‌ పండుగ నేపథ్యంలో శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా ఉండేందుకు జిల్లా వ్యాప్తంగా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు ఎస్పీ రాజేష్‌ చంద్ర గురువారం తెలిపారు. జిల్లాలో 6 ప్రత్యేక చెక్‌పోస్టులు ఏర్పాటు చేశామని వెల్లడించారు. వాహనాలు ఆపడం, తనిఖీలు చేయడం లాంటి అధికారాలు కేవలం ప్రభుత్వ విభాగాలకు మాత్రమే ఉంటాయన్నారు. వ్యక్తులు గానీ, సంస్థలు గానీ తనిఖీలకు దిగడం నిషేధమని స్పష్టం చేశారు. సోషల్‌ మీడియా వేదికగా ద్వేషపూరిత, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినా, మత సామరస్యానికి భంగం కలిగించే పోస్టులు పెట్టినా చర్యలు తప్పవన్నారు. అలాంటి వాటిపై పోలీసుల నిరంతర నిఘా ఉంటుందన్నారు. ప్రజలందరూ సోదరభావంతో మెలగాలని కోరారు. ఎక్కడైనా శాంతికి విఘాతం కలిగించే అంశం ఏదైనా ఉంటే వెంటనే పోలీసుల(హెల్ప్‌లైన నంబర్‌– 87126 86133 )కు సమాచారం ఇవ్వాలన్నారు. అంతేగానీ చట్టాన్ని ఎవరూ చేతుల్లోకి తీసుకోవద్దని సూచించారు. అత్యవసర సహాయం కోసం డయల్‌ 100కు ఫోన్‌ చేయాలన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement