భిక్కనూరు: రాజంపేట మండల కేంద్రంలోని ఎస్‌బీఐ బ్రాంచ్‌లో సైబర్ నేరాలపై పోలీస్ కళాబృందం ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం గురువారం నిర్వహించారు. అపరిచుతులకు ఓటీపీలు చెప్పవద్దని, ఫోన్ పాస్‌వర్డ్స్ ఎవరికీ చెప్పవద్దని సూచించారు. మాదకద్రవ్యాలు సేవించడం వల్ల కలిగే నష్టాలు కుటుంబాల పరిస్థితి గురించి పాటల రూపంలో వినిపించారు. అలాగే షీ టీంల గురించి సైబర్ నేరాల టోల్ ఫ్రీ నంబర్ 1930, అత్యవసర సమయాల్లో 100కి డయల్ చేయాలని వివరించారు. పోలీస్ కళాబృందం ఇన్‌చార్జి హెడ్ కానిస్టెబుల్స్ రామంచ తిరుపతి, శేషారావు, కానిస్టేబుళ్లు ప్రభాకర్, సాయిలు, బ్యాంకు మేనేజర్ రాజశేఖర్‌గౌడ్, లింగంపేట హెడ్‌కానిస్టెబుల్ రమేష్, షీటీం సభ్యులు భానురెడ్డి పాల్గొన్నారు.


