మోర్తాడ్ మండలం సుంకెట్‌లోని శ్రీకృష్ణ మందిరంలో భగవద్గీత పారాయణం చేస్తున్న భక్తులు, పాల్గొన్న చిన్నారులు
మోర్తాడ్(బాల్కొండ): ప్రపంచంలోనే అత్యంత ప్రామాణిక, ధార్మిక గ్రంథంగా కీర్తింపబడుతున్న భగవద్గీతను పారాయణం చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారీ చిన్నారులు. వేసవి సెలవులను కాలక్షేపం కోసం కాకుండా ధార్మిక సేవపై దృష్టి సారించిన మోర్తాడ్ మండలం సుంకెట్ చిన్నారులు భగవద్గీత శ్లోకాలను కంఠస్థం చేయడంతోపాటు అవగాహన పెంపొందించుకుంటున్నారు. శ్రీకృష్ణ మందిరంలో రోజూ సాయంత్రం గీతా పారాయణ కార్యక్రమాన్ని భక్తులు రాజేందర్, కత్తి గంగాధర్, గోవర్దన్ నిర్వహిస్తుండగా గ్రామంలోని చిన్నారులు భాగస్వాములు అవుతున్నారు. భగవద్గీత ప్రాముఖ్యత గురించి ఎందరో మహానుభావులు గొప్ప గా వర్ణించారు. అందుకే తాము చదవలేకపో యినా మా చిన్నారులైనా శ్లోకాలను పఠించి అందులోని పరమార్థాన్ని గ్రహిస్తే తాము ఎంతో భా గ్యవంతులమైనట్లే అని పిల్లల తల్లిదండ్రులు చెబుతున్నారు.చిన్న వయస్సులోనే గీతా శ్లోకా లను కంఠస్థం చేయడం, అవగాహన పెంపొందించుకోవడంపై దృష్టి సారించిన చిన్నారుల ను అభినందించాల్సిందే.
రోజుకు కొన్ని శ్లోకాలను చదువుతూ అర్థం తెలుసుకుంటున్నాం. మాకు అర్థం అయ్యేలా శ్లోకాల పూర్తి వి వరాలను చెబుతున్నారు. గీ తా పారాయణం ఎంతో బా గుంది. పోటీ పడి శ్లోకాలను కంఠస్థం చేస్తున్నాం. – శ్రీవాణి
రోజూ సాయంత్రం ఎప్పుడెప్పుడవుతుందీ.. గీతా పారాయణానికి వెళ్లాలనే కాంక్ష మాలో బలంగా ఉంది. మాకు గీతా శ్లోకాలను చెప్పేవారు ఆలయం వద్దకు వెళ్లకముందే మేమే వెళుతున్నాం. గీతా గ్రంథాలను చదువుతున్నాం. – మాన్విత
వేసవి సెలవులను వృథా కానివ్వకుండా గీతా శ్లోకాలను చదువుకుంటున్నాం. ఇంటివద్ద ఉన్నప్పుడు కూడా శ్లోకాలను చదువుకుంటూ అ ర్థం తెలుసుకుంటున్నాం. మా గ్రామంలో గీతా శ్లో కాలు చదివే కార్యక్రమం ఎంతో బాగుంది. – వర్షిత
గీతా శ్లోకాలపై పోటీలను నిర్వహిస్తే మేము తప్పకుండా పాల్గొంటాం. రోజు కొన్ని శ్లోకాలను నేర్చుకోవడం ఎంతో సంతోషంగా ఉంది. మా తల్లిదండ్రులు కూడా ఎంతో సంతోషంగా ఉన్నారు. – శ్రీనిత
గీతా పారాయణంతో చదువుపై ఆసక్తి పెరిగింది. గీతలో శ్రీకృష్ణుడు ఎన్నో గొప్ప విషయాలను చెప్పడం అదంతా మన జీవితంతో ముడిపడి ఉందనే విషయాన్ని తెలుసుకున్నాం. చేసే పనిపై పట్టు సంపాదించడానికి గీతా పారాయణం తోడ్పడుతుంది. – హరిగ్న
ప్రతి ఒక్కరూ గీతా శ్లోకాలను చదువుకోవాలి. మనిషి జీవితం మొత్తం ఈ గ్రంథంపైనే ఆధారపడింది. మేము ఆటలాడుకోవడం కన్నా గీతా శ్లోకాలను నేర్చుకోవడంపైనే ఆసక్తిని పెంపొందించుకున్నాం. – వరునిత
భగవద్గీత శ్లోకాలను పాఠశాలల్లోనూ నేర్పించాలి. ప్రతి ఒక్కరి జీవితంలో ఈ గ్రంథం ఎంతో కీలకమైంది. గీతా పారాయణంతో మాకు ఎంతో అవగాహన వచ్చింది. మొదట్లో కొంత ఇబ్బంది అనిపించినా ఇప్పుడు సంతోషంగా ఉంది. – ప్రణవి
సెలవుల్లో గీతా పారాయణం
భగవద్గీత శ్లోకాలను
కంఠస్థం చేస్తున్న చిన్నారులు
ఆదర్శంగా నిలుస్తున్న
సుంకెట్ విద్యార్థులు


