కామారెడ్ది అర్బన్: కేంద్ర మంత్రి బండి సంజయ్ తన కుమారుడు భగీరథ్‌ను పోక్సో కేసు నుంచి తప్పించడానికి ప్రయత్నిస్తున్నాడని, వెంటనే సంజయ్‌ను మంత్రి పదవి నుంచి తప్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డీటీఎఫ్ రాష్ట్ర కౌన్సిలర్ విజయరామరాజు డిమాండ్ చేశారు. బండి భగీరథ్‌పై తీవ్రమైన ఆరోపణలతో పోక్సో కేసు నమోదు చేసిన పోలీసులు అరెస్ట్ చేయకుండా కాలయాపన చేయడం అనుమానాలకు తావిస్తోందని, చట్టం తన పని ఎందుకు చేసుకుపోవడం లేదని విజయరామరాజు ప్రశ్నించారు. పోలీసు శాఖ పనితీరుపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని, సామాన్యుల విషయంలో ఇలాగే వ్యవహరిస్తారా అని ప్రశ్నించారు.
బాన్సువాడ రూరల్: ప్రతి రైతు ఫార్మర్ రిజిస్ట్రీ చేయించుకోవాలని కోనాపూర్ క్లస్టర్ వ్యవసాయ విస్తర్ణాధికారి జ్ఞానేశ్వర్ అన్నారు. రైతులు తమ ఆధార్‌కార్డు, పట్టాపాసుపుస్తకం, ఫోన్ నెంబర్ తదితర అంశాలను ఏఈవోలకు తెలిపితే వారు రిజిస్ట్రీ చేస్తారన్నారు. భవిష్యత్తులో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు పరిచే ప్రతి పథకం, కార్యక్రమానికి ఫార్మర్ రిజిస్ట్రీ తప్పనిసరి అన్నారు. క్టస్టర్‌లో మిగిలిపోయిన రైతులు రైతువేదికలో సంప్రదించాలన్నారు.
గాంధారి(ఎల్లారెడ్డి): మండల కేంద్రంలో అక్రమంగా చేపడుడుతన్న ఇంటి పనులను గురువారం నిలిపివేసినట్లు పంచాయతీ కార్యదర్శి నాగరాజు తెలిపారు. కార్యదర్శి మాట్లాడుతూ..‘ గ్రామానికి చెందిన కొక్కొండ భాస్కర్ తన పాత ఇంటిని కూల్చి అదే స్థలంలో కొత్తగా ఇంటి నిర్మాణం చేపట్టారు. అయితే గ్రామ పంచాయతీ నుంచి పాత ఇంటి స్థలం వరకే అనుమతి ఇచ్చామన్నారు. కాని ఆయన అనుమతి పొందిన స్థలంకాకుండా మరో మూడు అడుగులు ముందుకు జరిగి దారిని ఆక్రమించే ప్రయత్నం చేశాడు. దీంతో 15 రోజుల క్రితం గ్రామాభివృద్ధి కమిటీతో పాటు గ్రామస్తులు ఫిర్యాదు చేశారు. నిర్మాణ పనులను పరిశీలించి అనుమతి ఉన్నంత వరకే ఇంటి నిర్మాణం చేపట్టాలని సూచించాం. గ్రామ పంచాయతీ సూచనలను పట్టించుకోకుండా నిర్మాణ పనులు మళ్లీ ప్రారంభించాడు. గురువారం మళ్లీ గ్రామాభివృద్ది కమిటీ సభ్యులతో పాటు గ్రామస్తులు ఇంటి నిర్మాణ పనులను నిలిపి వేయాలని ఫిర్యాదు చేశారు. ఇంటి స్థలాన్ని పరిశీలించి పిల్లర్ల నిర్మాణం కోసం ఏర్పాటు చేసిన సెంట్రింగ్ డబ్బాలను స్వాధీనం చేసుకున్నాం’ అని తెలిపారు.
గాంధారి(ఎల్లారెడ్డి): ప్రభుత్వ పాఠశాలల్లో ఏర్పాటు చేసిన వేసవి శిక్షణ శిబిరాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని ఎంఈవో శ్రీహరి అన్నారు. గురువారం ఆయన పలు పాఠశాలలను, వేసవి శిక్షణ శిబిరాను పరిశీలించారు. శిబిరాల్లో ఎంత మంది విద్యార్థులు శిక్షణకు హాజరువుతున్నారు, వారికి సరియైన మౌ లిక సదుపాయాలు అందుబాటులో ఉన్నాయా లేదా అనే విషయాలను ఉపాధ్యాయులను అ డిగి తెలుసుకున్నారు. అనంతరం విద్యార్థులు, ఉపాధ్యాయులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించాలని సూచించారు.
దోమకొండ: అంబారీపేట గ్రామంలో ఉన్న వేంకటేశ్వర ఆలయం, శివాలయాన్ని పునరుద్ధరించడానికి గ్రామానికి చెందిన ఎన్‌ఆర్‌ఐ గునిగంటి ప్రభాకర్‌రావ్ ముందుకు వచ్చారు. ఈ మేరకు గురువారం తన సొంత నిధులు రూ.25లక్షలతో పనుల ప్రారంభానికి శంకుస్థాపన చేశారు. ఆయన అమెరికాలో కార్డియాలజిస్ట్ కాగా, ఆయన తరపున వారి మేనకోడలు సురభి నిర్మల సత్యంరావులు పనులకు శంకుస్థాపన చేశారు. పుట్టిన ఊరిలో రెండు పురాతన దేవాలయాలు శిథిలావస్థలకు చేరాయని ఆయనకు గ్రామస్థులు ద్వారా సమాచారం అందించగా వెంటనే స్పందించి తన బంధువులతో పనులకు శ్రీకారం చుట్టారని సర్పంచ్ అరుట్ల కవిత అనిల్ తెలిపారు. ఉప సర్పంచ్ సత్తాగౌడ్, ఆలయ అర్చకులు కృష్ణమాచార్యులు, దేవదాయ కమిటీ అధ్యక్షులు నీల గంగాధర్, తదితరులున్నారు.


