పూర్వ విద్యార్థుల సహకారం అవసరం | - | Sakshi
Sakshi News home page

పూర్వ విద్యార్థుల సహకారం అవసరం

May 15 2026 10:26 AM | Updated on May 15 2026 10:26 AM

బాన్సువాడ రూరల్‌: కళాశాల అభివృద్ధికి పూర్వ విద్యార్థుల సహకారం ఎంతో అవసరమని శ్రీరాం నారాయణ ఖేడియా ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్‌ డా. గంగాధర్‌ అన్నారు. గురువారం కళాశాలలో ప్రజాపాలన– ప్రగతి ప్రణాళికలో భాగంగా విద్యావారోత్సాలు నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన తల్లిదండ్రులు, పూర్వవిద్యార్థులనుద్దేశించి మాట్లాడారు. అందరి సహకారంతో కళాశాల దినదినాభివృద్ధి సాధిస్తోందన్నారు. ఇంటర్మీడియట్‌ పాసైన విద్యార్థులను కళాశాలలో చేర్పించే బాధ్యత పూర్వవిద్యార్థులపై ఉందన్నారు. అనంతరం పేరెంట్స్‌ బాలయ్య, గంగారాం, సాయిలుతో పాటు పూర్వ విద్యార్థులు సుధాకర్‌రెడ్డి, శేఖర్‌, శ్రీనివాస్‌లను సన్మానించారు. వైస్‌ ప్రిన్సిపల్‌ గులాం ముస్తాఫా, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement