కామారెడ్డి అర్బన్: ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం చేస్తుందని, ధాన్యం తరలింపునకు వాహనాలను ఏర్పాటు చేయాలని భారతీయ కిసాన్ సంఘ్ జిల్లా అధ్యక్షుడు పైడి విఠల్‌రెడ్డి అన్నారు. గురువారం కామారెడ్డి పట్టణ పరిధిలోని లింగాపూర్ స్టేజీ సమీపంలోని కొమిరెడ్డి చిన్నఅంజన్న వ్యవసాయ క్షేత్రం వద్ద భారతీయ కిసాన్ సంఘ్ జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించారు. వరి, మక్క ధాన్యం కొనుగోళ్ల తూకాలు వేయడం, వేసిన వాటిని వెంటనే తరలించాలని ఎన్ని విజ్ఞప్తులు చేసినా ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం చేస్తుందని ఆయన అన్నారు. రైతులు చైతన్యమై అధికారులను నిల దీయాలన్నారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అంబీర్ ఆనందరావు, రాష్ట్ర కార్యదర్శి కొమిరెడ్డి అంజన్న, జిల్లా నాయకులు సాయిరెడ్డి, రాంరెడ్డి, రామచంద్రం, చిన్న అంజన్న తదితరులు పాల్గొన్నారు.


