కామారెడ్డి క్రైం: గ్రామపంచాయతీలు, ము న్సిపాలిటీల పరిధిలో ఉన్న వీధి కుక్కలను గుర్తించి, వాటిని ఏబీసీ (యానిమల్ బర్త్ కంట్రోల్) సెంటర్‌కు తరలించాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో జిల్లాలో వీధి కుక్క ల నిర్వహణపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వీధి కుక్కలతో ఎలా వ్యవహరించాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే అంశాలపై వి ద్యార్థులకు అవగాహన సదస్సులు నిర్వహించాలన్నారు. ప్రస్తుతం కామారెడ్డిలో ఉ న్న ఏబీసీ సెంటర్‌కు అదనంగా మరో రెండు ఏబీసీ సెంటర్ల ఏర్పాటు కోసం తగిన స్థలం, భవనాల గుర్తించాలని అధికారులకు సూచించారు. సమావేశంలో అదనపు కలెక్ట ర్ గిరి, జెడ్పీ సీఈవో చందర్, వెటర్నరీ, పశు సంవర్ధక, మున్సిపల్, జిల్లా పంచాయతీ శా ఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
ఇంటర్ సప్లిమెంటరీ
పరీక్షలు ప్రారంభం
కామారెడ్డి టౌన్ : జిల్లాలో బుధవారం ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఉదయం జరిగిన మొదటి సంవత్సరం పరీక్షలకు 513 మంది విద్యార్థులు హాజరుకావాల్సి ఉండగా 34 మంది గైర్హాజరయ్యారు. మద్యాహ్నాం జరిగిన ద్వితీయ సంవత్సరం పరీక్షకు 1,830 మందికిగానూ 1734 మంది హాజరయ్యారు. పరీక్షలను జిల్లా ఇంటర్ నోడల్ అధికారి షేక్ సలాం పర్యవేక్షించారు.
ప్రశాంతంగా పాలిసెట్
కామారెడ్డి అర్బన్: పాలిసెట్ బుధవారం ప్రశాంతంగా ముగిసిందని సెట్ జిల్లా కన్వీనర్, కామారెడ్డి ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ప్రిన్సిపల్ విజయ్‌కుమార్, పరిశీలకుడు మోహన్‌కుమార్ తెలిపారు. 2,643 మంది విద్యార్థుల కోసం కామారెడ్డి పట్టణంలో 6 కేంద్రాలు ఏర్పాటు చేశామని, పరీక్షకు 2,502 మంది హాజరయ్యారని పేర్కొన్నారు. ఇందులో బాలికలు 1,464 మంది, బాలురు 1,117 మంది ఉన్నారని తెలిపారు. 62 మంది బాలురు, 79 మంది బాలికలు పరీక్షకు గైర్హాజరయ్యారని పేర్కొన్నారు.
హెచ్‌పీఎస్‌లో ప్రవేశానికి
దరఖాస్తుల ఆహ్వానం
కామారెడ్డి అర్బన్: బేగంపేట్‌లోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌లో ఒకటో తరగతిలో ప్రవేశం కోసం ఎస్సీలనుంచి దరఖాస్తుల కోరుతున్నట్లు జిల్లా ఎస్సీ సంక్షేమాధికారి వెంకటేష్ ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాకు రెండు సీట్లు కేటాయించారని, ఆసక్తిగలవారు ఈనెల 29 వరకు దరఖాస్తు చేసుకోవాలని, పూర్తి వివరాలకు కలెక్టరేట్‌లోని తమ కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు.
విద్యుత్ డీఈ (అపరేషన్)గా
నందకుమార్
కామారెడ్డి అర్బన్: ఎన్పీడీసీఎల్ కామారెడ్డి అపరేషన్ విభాగం డివిజనల్ ఇంజినీర్‌గా నందకుమార్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు ఇక్కడ పనిచేసిన కల్యాణ చక్రవర్తి ప్రమోషన్‌పై ఎంఆర్‌టీ విభాగానికి బదిలీ అయ్యారు. బాధ్యతలు తీసుకున్న నందకుమార్, బదిలీ అయిన కల్యాణ చక్రవర్తిలను వివిధ విద్యుత్ యూనియన్ల నాయకులు, ఇంజినీర్లు, సిబ్బంది సన్మానించారు.
నేడు భారతీయ కిసాన్ సంఘ్ సమావేశం
కామారెడ్డి అర్బన్: భారతీయ కిసాన్ సంఘ్ జిల్లా సమావేశాన్ని గురువారం నిర్వహించనున్నట్లు సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు విఠల్‌రెడ్డి, శంకర్‌రావు తెలిపారు. కామారెడ్డి పట్టణ పరిధిలోని లింగాపూర్ గేట్ వద్ద కొమిరెడ్డి చిన్న అంజన్న వ్యవసాయ క్షేత్రంలో ఉదయం 11.30 గంటలకు సమావేశం ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. జిల్లాలోని ప్రతినిధులు సకాలంలో హాజరు కావాలని కోరారు.
నిబంధనలు పాటించాలి
గాంధారి: కొనుగోలు కేంద్రాల నిర్వాహకు లు, రైతులు ప్రభుత్వ నిబంధనలు పాటించాలని జిల్లా సహకార అధికారి రామ్మోహన్ సూచించారు. ఆయన బుధవారం మానిటరింగ్ అధికారి సురేష్‌తో కలిసి గుర్జాల్ కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. కొనుగోలు కేంద్రంవద్ద ఆరబెట్టిన, కాంటా చేసిన మొ క్కజొన్నలను పరిశీలించారు. నిర్వాహకుల కు పలు సూచనలు ఇచ్చారు. కార్యక్రమంలో సింగిల్ విండో వైస్ చైర్మన్ ఉద్దల్‌సింగ్, ఏఈవో విఘ్నేష్, రైతులు ఉన్నారు.


