నాలుగు రోజుల్లో కొనుగోళ్లు పూర్తవ్వాలి | - | Sakshi
Sakshi News home page

నాలుగు రోజుల్లో కొనుగోళ్లు పూర్తవ్వాలి

May 14 2026 12:49 AM | Updated on May 14 2026 12:49 AM

ఉత్తునూరులో..

రవాణా ప్రక్రియను

వేగవంతం చేయాలి

రామారెడ్డి: వడ్ల కొనుగోలు ప్రక్రియను నాలుగు రో జుల్లో పూర్తి చేయాలని కలెక్టర్‌ ఆశిష్‌ సంగ్వాన్‌ అధికారులను ఆదేశించారు. బుధవారం ఆయన గిద్ద గ్రామంలోని కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు తాగునీరు, ఓఆర్‌ ఎస్‌ ప్యాకెట్లు, అవసరమైన మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. ఫార్మర్‌ రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేసి, అర్హులైన ప్రతి రైతుకు ప్రభుత్వ సేవలు అందేలా చర్య లు తీసుకోవాలని సూచించారు. కలెక్టర్‌ వెంట సివి ల్‌ సప్లై అధికారి వెంకటేశ్వర్లు, డీఆర్‌డీవో సురేంద ర్‌, సివిల్‌ సప్లై డీఎం శ్రీకాంత్‌, తహసీల్దార్‌ ఉమాల త, ఏవో భానుశ్రీ తదితరులున్నారు.

సదాశివనగర్‌: మక్కల కొనుగోళ్లను వేగవంతంగా పూర్తి చేయాలని కలెక్టర్‌ సూచించారు. బుధవారం ఆయన ఉత్తునూర్‌లోని మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. ఎండల తీవ్రతను దృష్టిలో పెట్టుకుని ఉదయం, సాయంత్రం వేళల్లో మాత్రమే తూకాలు చేయాలన్నారు. కేంద్రాల వద్ద తాగునీరు, నీడ వసతి, ఏఆర్‌ఎస్‌ ప్యాకెట్లను అందుబాటులో ఉంచాలన్నారు. ఇప్పటికే 5 వేల క్వింటాళ్ల మొక్కజొన్నలను గోదాంలకు తరలించామన్నారు. మిగిలిన స్టాక్‌ను పది రోజుల్లో పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ గిరి, డీఎస్‌వో రామ్మోహన్‌, మండల ప్రత్యేకాధికారి సతీష్‌ యాదవ్‌, విండో చైర్మన్‌ ప్రభాకర్‌, విండో సీఈవో నహీం, తహసీల్దార్‌ సత్యనారాయణ, సర్పంచ్‌ శ్రీనివాస్‌గౌడ్‌, ఉప సర్పంచ్‌ రాజయ్య తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement