● వైకుంఠధామంలో వెలగని దీపాలు
● హెడ్‌లైట్ల వెలుతురులో
దహన సంస్కారాల నిర్వహణ
కామారెడ్డి టౌన్ : గౌరవప్రదంగా సాగాల్సిన అంతి మ సంస్కారాలు.. అష్టకష్టాల మధ్య నిర్వహించాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రధానంగా జిల్లాకేంద్రంలోని శ్మశాన వాటికలలో సరైన సౌకర్యాలు లేకపోవడంతో అంత్యక్రియల నిర్వహణకూ ఇబ్బందులు తప్పడం లేదు.
జిల్లా కేంద్రానికి చెందిన ఓ మహిళ బుధవారం మరణించగా కుటుంబ సభ్యులు అంత్యక్రియలకో సం రాత్రి రాజీవ్‌నగర్ శ్మశానవాటికకు తీసుకువెళ్లా రు. అయితే అక్కడ కనీసం విద్యుత్ సౌకర్యం కూడా లేదు. ఒక్క బల్బ్ కూడా వెలగకపోవడంతో సెల్‌ఫో న్ లైట్ల వెలుతురులో దింపుడు కల్లం నిర్వహించా రు. అనంతరం వాహనాల హెడ్‌లైట్ల కాంతిలో దహ న సంస్కారాలు జరిపించారు. స్మశానంలో కనీసం విద్యుత్ సౌకర్యం కూడా కల్పించలేని స్థితిలో పాలకులు ఉండడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
స్పందన కరువు
జిల్లాకేంద్రంలోని వైకుంఠధామాల్లో నెలకొన్న సమ స్యలను ‘సాక్షి’ పలుమార్లు వెలుగులోకి తెచ్చింది. దీనిపై స్పందించి అన్ని వసతులు కల్పించేందుకు స్వచ్ఛంద సంస్థ ముందుకు వచ్చినా పాలకులు అ నుమతులు ఇవ్వడం లేదు. కనీస సౌకర్యాలు కల్పించేందుకూ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. ఇప్పటికైనా అధికారులు స్పందించి శ్మశాన వాటికల్లో మౌలిక వసతులు కల్పించాలని ప్రజలు కోరుతున్నారు.


