లింగంపేట(ఎల్లారెడ్డి): మండల కేంద్ర సమీపంలోని పెద్దవాగులో ప్రమాదవశాత్తు వాగులో పడి ఒకరు మృతి చెందినట్లు ఎస్సై దీపక్‌కుమార్ తెలిపారు. మండల కేంద్రానికి చెందిన మంద అనిల్‌కుమార్(28) ఫిట్స్‌తో బాధపడుతున్నాడు. ఈ నెల 11న ఉదయం ఇంటి నుంచి వెళ్లి సాయంత్రం వరకు తిరిగి రాలేదు. బుధవారం ఉదయం పెద్దవాగులోని గుర్రం మడుగులో అనిల్‌కుమార్ మృతదేహం నీటిపై తేలడాన్ని స్థానికులు గమనించి సమాచారం అందించారు. భార్య భవానీ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.
గల్ఫ్‌లో రాజంపేట యువకుడు..
భిక్కనూరు: రాజంపేట మండల కేంద్రానికి చెందిన యువకుడు గల్ఫ్‌లో మృతి చెందినట్లు గ్రామస్తులు బుధవారం తెలిపారు. గ్రామానికి చెందిన జొన్నల బాలకృష్ణ (24) కొన్నేళ్లుగా గల్ఫ్ దేశానికి వలస వెళ్తున్నాడు. ఆరు నెలల క్రితం రాజంపేటకు వచ్చి తిరిగి బహ్రెయిన్ దేశానికి వెళ్లి పనిచేస్తున్నాడు. బుధవారం ఉదయం తోటి మిత్రులు బాలకృష్ణ్ణను నిద్రలేపడానికి ప్రయత్నించగా లేవలేదు. నిద్రలోనే గుండెపోటుతో మృతి చెందినట్లు నిర్ధారించారు. ఈ విషయాన్ని కుటుంబీకులకు సమాచారం అందించారు.


