● భార్య మృతి, భర్తకు తీవ్రగాయాలు
పిట్లం(జుక్కల్): మండలంలోని గద్దగుండు తండా శివారు జాతీయ రహదారిపై బుధవారం మధ్యా హ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి చెందింది. ఎస్సై ఆంజనేయులు తెలిపిన వివరాల ప్రకారం.. పెద్దకొడప్‌గల్ మండల కేంద్రానికి చెందిన మారేపల్లి హన్మాండ్లు తన భార్య లక్ష్మి(48)తో ఎల్లారెడ్డి మండలం కళ్యాణిలో నిర్వహిస్తున్న బంధువుల వివాహానికి బైక్‌పై వస్తున్నారు. గద్దగుండు తండా సమీపంలో బైక్ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టడంతో వెనుక కూర్చున్న లక్ష్మి కిందపడటంతో తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతి చెందింది. హన్మాండ్లుకి తీవ్రగాయాలయ్యాయి. మృతురాలి తల్లి మేత్రి సాయవ్వ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.


