ఇందల్వాయి: మండలంలోని రూప్లనాయక్ తండాకి చెందిన విశాల్ నాయక్ (23) ఢిల్లీలో బుధవారం ఆత్మహత్యకు పాల్పడినట్లు స్థానికులు తెలిపారు. బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసిన విశాల్ ఓ ప్రైవేట్ సంస్థలో నటనకు సంబంధించిన శిక్షణ తీసుకుంటున్నాడు. ఆత్మహత్యకు గల పూర్తి కారణాలు తెలియాల్సి ఉంది. గురువారం రూప్లానాయక్ తండాలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు స్థానికులు తెలిపారు.
మహిళ ..
బోధన్ రూరల్: మండలంలోని కల్దుర్కి గ్రామానికి చెందిన లక్ష్మి(58) అనారోగ్యం, మతిస్థిమితం సరిగాలేక ఆత్మహత్యకు పాల్పడినట్లు బోధన్ రూరల్ ఎస్సై మచ్చేందర్‌రెడ్డి తెలిపారు. మంగళవారం అర్ధరాత్రి ఇంట్లో చీరతో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు పేర్కొన్నారు. బుధవారం కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. మృతురాలికి కొడుకు, కూతురు ఉన్నారు.


