● ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్‌రెడ్డి
బాన్సువాడ రూరల్: విద్యార్థులు ప్రభుత్వం అందిస్తున్న వసతులను సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. బుధవారం మండలంలోని శ్రీరాం నారాయణ ఖేడియా ప్రభుత్వ డిగ్రీకళాశాలలో విద్యావారోత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో స్టేట్ ఆగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాలరాజుతో కలిసి పాల్గొని మాట్లాడారు. విద్యార్థులకు చక్కటి కౌన్సిలింగ్ చేస్తూ వారితో స్టడీ గ్రూపులు ఏర్పాటు చేయాలని ప్రిన్సిపల్ గంగాధర్‌ను సూచించారు. సాంకేతిక సహాయాన్ని విద్యార్థులు వినియోగించుకోవాలన్నారు. గత విద్యాసంవత్సరం వివిధ కోర్సుల్లో టాపర్లుగా నిలిచిన విద్యార్థులకు సర్టిఫికెట్లు అందించి అభినందించారు. కళాశాల ప్రిన్సిపల్ గంగాధర్, బాన్సువాడ సహకార సంఘం అధ్యక్షుడు కృష్ణారెడ్డి, ఎంఈవో నాగేశ్వరరావు, ఏఎంసీ చైర్మన్ సురేష్‌బాబా, తదితరులున్నారు.
జనగణనకు ప్రతి ఒక్కరూ సహకరించాలి
బాన్సువాడ : ప్రతి పౌరుడు జనగణనలో తప్పనిసరిగా పాల్గొని తమ వివరాలను నమోదు చేసుకోవాలని ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. బుధవారం బాన్సువాడలో ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్‌రెడ్డి కుటుంబ సభ్యుల వివరాలను అధికారులు నమోదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జనగణనకు వచ్చే సర్వే అధికారులకు ప్రతీ ఒక్కరు సహకరించాలని కోరారు. సర్వే అధికారులు రాంజెట్టి, శ్రీనివాస్, బాల్‌రాజ్ తదితరులున్నారు.


