ఈ ఏడాది 499 సెల్‌ఫోన్ల రికవరీ | - | Sakshi
Sakshi News home page

ఈ ఏడాది 499 సెల్‌ఫోన్ల రికవరీ

May 14 2026 12:49 AM | Updated on May 14 2026 12:49 AM

ఎస్పీ రాజేష్‌ చంద్ర

కామారెడ్డి క్రైం: ప్రతి నెలా వందకు పైగా సెల్‌ఫోన్ల రికవరీ చేస్తున్నామని ఎస్పీ రాజేష్‌ చంద్ర తెలిపారు. ఈ ఏడాది ఇప్పటివరకు 499 సెల్‌ఫోన్‌లను రికవరీ చేసినట్లు వెల్లడించారు. జిల్లా పోలీసు కార్యాలయంలో బుధవారం ఆయన మాట్లాడారు. ఎవరైనా సెల్‌ఫోన్‌ పోగొట్టుకుంటే ఆందోళనకు గురి కావద్దన్నారు. సీఈఐఆర్‌ విధానంలో సెల్‌ఫోన్‌ రికవరీ చేయడానికి అవకాశం ఉందన్నారు. జిల్లాలో గత నెల రోజులుగా చేపట్టిన స్పెషల్‌ డ్రైవ్‌లో భాగంగా బాధితులు పోగొట్టుకున్న, చోరీకి గురైన 115 సెల్‌ఫోన్‌లను రికవరీ చేసినట్లు తెలిపారు. వాటి విలువ దాదాపు రూ.19 లక్షలు ఉంటుందన్నారు. ఇప్పటివరకు జిల్లా వ్యాప్తంగా మ్తొతం రూ.7.64 కోట్ల విలువైన 4,780 సెల్‌ఫోన్‌లను రికవరీ చేసినట్లు వెల్లడించారు. ఎవరైనా సెల్‌ఫోన్‌ పోగొట్టుకుంటే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పాటు భద్రతా కారణాల దృష్ట్యా వెంటనే పాత సిమ్‌ కార్డును బ్లాక్‌ చేయించాలని సూచించారు. రికవరీ చేసిన ఫోన్‌ల వివరాలను బాధితులకు తెలియపరుస్తామన్నారు. వారు జిల్లా పోలీసు కార్యాలయానికి వచ్చి ఆర్‌ఎస్సై బాల్‌రాజు (87126 86114) ను సంప్రదించి ఫోన్‌లు తీసుకువెళ్లాలని సూచించారు. ఏఎస్పీ నరసింహా రెడ్డి, అధికారులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement