పీహెచ్‌సీని తనిఖీ చేసిన డీఎంహెచ్‌వో | - | Sakshi
Sakshi News home page

పీహెచ్‌సీని తనిఖీ చేసిన డీఎంహెచ్‌వో

May 6 2026 8:13 AM | Updated on May 6 2026 8:13 AM

తాడ్వాయి: ఎర్రాపహాడ్‌లోని ప్రాథమిక ఆ రోగ్య కేంద్రాన్ని మంగళవారం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి(డీఎంహెచ్‌వో) రవీందర్‌గౌడ్‌ తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించారు. అనంతరం ఫార్మసీ, ల్యాబ్‌ గదులను తనిఖీ చేశారు. రోజూ సక్రమంగా విధులకు హాజరు కావాలని, ప్రజలకు అందుబాటులో ఉండి వైద్య సేవలను అందించాలని వైద్యులకు సూచించారు. ఆరోగ్య మహిళ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రజలను కోరారు. ఆయన వెంట మండల వైద్యాధికారి ఖాసీం, హెచ్‌ఈవో నారాయణ, పీహెచ్‌ఎన్‌లు నక్షత్రం, స్వాతి, శ్రీనివాస్‌, సుమలత తదితరులు ఉన్నారు.

రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్‌కు

ఎంపిక

కామారెడ్డి అర్బన్‌: జిల్లాకేంద్రంలోని ఇందిరాగాంధీ స్టేడియంలో మంగళవారం జిల్లా స్థాయి అథ్లెటిక్స్‌ ఎంపిక పోటీలు నిర్వహించారు. సీనియర్స్‌, అండర్‌–16, 18, 20 మహిళలు, పురుషుల విభాగాలలో పోటీలు నిర్వహించగా.. 76 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. ఇందులో ప్రతిభ చూపిన 21 మందిని రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేసినట్లు జిల్లా అథ్లెటిక్స్‌ అసోసియేషన్‌ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జైపాల్‌రెడ్డి, అనిల్‌కుమార్‌ తెలిపారు. ఎంపికై నవారు ఈనెల 10న హనుమకొండలోని జేఎన్‌ స్టేడియంలో నిర్వహించే రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్‌ పోటీల్లో పాల్గొంటారని పేర్కొన్నారు. కార్యక్రమంలో అసోసియేషన్‌ ప్రతినిధులు శ్రీనివాస్‌, ప్రభులింగం, రేణుక, శివాగౌడ్‌, నరేష్‌, మహేష్‌, నవీన్‌, సంతోష్‌, ప్రసాద్‌, సురేష్‌ తదితరులు పాల్గొన్నారు.

‘పంటల మార్పిడి చేయాలి’

భిక్కనూరు: రైతులు మారుతున్న కాలానికి అనుగుణంగా తమ పంటల మార్పిడి చేసుకోవాలని జిల్లా ఉద్యాన అధికారి జ్యోతి సూచించారు. మంగళవారం భిక్కనూరులోని ఎస్వీ గార్డెన్‌లో నిర్వహించిన ఉద్యాన పంటలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఉద్యాన పంటలు, ఆయిల్‌పామ్‌ సాగు విస్తీర్ణం పెంపుదల, ప్రత్యామ్నాయ పంటల సాగు తదితర అంశాలపై రైతులకు అవగాహన కల్పించారు. రైతులు పామాయిల్‌ పంటతో పాటు పండ్ల తోటల పెంపకానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా ఉద్యాన అధికారి సూచించారు. ఉద్యాన పంటలకు ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహకాలను వివరించారు. కార్యక్రమంలో భిక్కనూరు సర్పంచ్‌ బల్యాల రేఖ, ఏడీఏ అపర్ణ, పశువైద్యాధికారి దేవేందర్‌, పీసీసీ ప్రధాన కార్యదర్శి ఇంద్రకరణ్‌రెడ్డి, నేతలు భీంరెడ్డి, శ్రీరాం వెంకటేశ్‌, నరేందర్‌రెడ్డి, అధికారులు, హెచ్‌యూఎల్‌ ప్రతినిధులు పాల్గొన్నారు.

కాంటాలను

వేగవంతం చేయాలి

భిక్కనూరు: కొనుగోలు కేంద్రాల్లో కాంటాలను వేగవంతంగా నిర్వహించాలని జిల్లా వ్యవసాయాధికారి మోహన్‌రెడ్డి సూచించారు. మంగళవారం ఆయన భిక్కనూరులోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాలలో రైతులకు ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు. అవసరమైన మేర టార్పాలిన్‌లు కొనుగోలు కేంద్రాలలో అందుబాటులో ఉన్నాయన్నారు. ఆయన వెంట ఏడీఏ అపర్ణ, ఏఈవోలు వినోద్‌, లిఖిత్‌రెడ్డి పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement