ఆదాయ వనరులపై పట్టింపేది..? | - | Sakshi
Sakshi News home page

ఆదాయ వనరులపై పట్టింపేది..?

Mar 1 2026 7:33 AM | Updated on Mar 1 2026 7:33 AM

ఆదాయ వనరులపై పట్టింపేది..?

ఆదాయ వనరులపై పట్టింపేది..?

● మున్సిపాలిటీల్లో ఆస్తిపన్నుతో పాటు, భవన నిర్మాణాల అనుమతుల ద్వారా ఆదాయం సమకూరుతుంది.

● నల్లా పన్ను, ట్రేడ్‌ లైసెన్స్‌లు, హోర్డింగ్‌లు, సైన్‌ బోర్డులు, ఫ్లెక్సీల ద్వారా అధికంగా ఆదాయం వస్తుంది.

● అయితే వీటిని ఎలా వసూలు చేయాలి..?ఎ లా వినియోగించుకోవాలన్న దానిపై ప్రణాళికతో ముందుకెళ్తే తప్ప అభివృద్ధి చేసే అవకాశం ఉండదు.

● ఫంక్షన్‌ హాళ్లకు ప్రత్యేకమైన ట్యాక్స్‌ వేసే అవకాశం ఉంటుంది.

● ట్రెడ్‌ లైసెన్స్‌, సినిమా థియేటర్లపై దృష్టి పెడితే ఆదాయం పెంచుకోవచ్చు.

● షాపింగ్‌ కాంప్లెక్స్‌లు, అపార్ట్‌మెంట్స్‌ అత్యధికంగా నిర్మిస్తున్నారు. ఇందులో కొంత పన్ను లు ఎగవేసే వారు ఉంటారు. అలాంటివారిపై కాస్త కఠినంగా ఉంటే ఆదాయం వస్తుంది.

బాన్సువాడ: జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీలకు కొత్త పాలకవర్గం ఎన్నికై ంది. బల్దియాలను అభివృద్ధి వైపు నడిపించాలన్నా..ప్రజలకు మౌలిక వసతులు కల్పించాలన్నా ఆదాయ వనరులే అధారం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చే నిధులతో పాటు వివిధ మార్గాల ద్వారా మున్సిపాలిటీలకు సమకూరే ఆదాయ వనరులను సక్రమంగా సద్వినియోగం చేసుకుంటేనే ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు కల్పించే అవకాశం ఉంటుంది. ఆ దిశగా కొత్త పాలకవర్గాలు దృష్టి సారించాల్సిన అవసరం ఉందంటున్నారు. పట్టణ ప్రజలు, మున్సిపాలిటీలకు ప్రధానంగా ఆస్తి పన్నే ఆధారం. బాన్సువాడ మున్సిపాలిటీకి రూ.3 నుంచి రూ.4 కోట్ల డిమాండ్‌ ఉంటుంది. ప్రతీ మున్సిపాలిటీలో ఈ నిధులతోనే అభివృద్ధి పనులు చేసే అవకాశం ఉంటుంది. బల్దియాల్లో ఖాళీ స్థలాలకు ఆస్తిపన్ను విధించే అవకాశం ఉన్నా.. గత పాలకవర్గాలు ఎప్పుడు పట్టించుకోలేదన్న ఆరోపణలున్నాయి.

ఖాళీ స్థలాలపై దృష్టి సారించాలి..

జిల్లాలోని కామారెడ్డి, బాన్సువాడ, ఎల్లారెడ్డి, బిచ్కుంద మున్సిపాలిటీలున్నాయి. కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడలో అత్యధికంగా ఖాళీ స్థలాలు ఉన్నాయి. ప్రధానమైన చోట ఉండటంతో ఎక్కడబడితే అక్కడ ఆక్రమణలకు పాల్పడి మున్సిపాలిటీలకు నామమాత్రపు ఫీజులు చెల్లిస్తూ వ్యాపారాలు చేసుకుంటున్నారు. ఖాళీ స్థలాలపై దృష్టి పెట్టి ఆదాయం పన్ను పెంచుకుని ఇక్కడ షాపింగ్‌ కాంప్లెక్స్‌ నిర్మిస్తే ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది. తైజబారుతో మున్సిపాలిటీలకు రూ.లక్షల్లో ఆదాయం ఉంది. తైబజారు వేలం పకడ్బందీగా నిర్వహిస్తే అనుకున్న ఆదాయం సమకూరుతుంది.

14వ ఆర్థిక సంఘం నుంచి నిధులు..

14వ ఆర్థిక సంఘం నుంచి కేంద్రం ఏటా రెండు సార్లు నిధులు విడుదల చేస్తుంది. జనాభాను బట్టి ఈ నిధులు వస్తుంటాయి. వీటిని ప్రణాళిక, ప్రణాళికేతర పనులకు ఖర్చు చేసుకునే వెసులుబాటు ఉంది. స్వచ్ఛ భారత్‌, పట్టణ ప్రణాళికకు వీటిని వినియోగిస్తుంటారు. స్టేట్‌ ఫైనాన్స్‌ ద్వారా వచ్చే నిధులు పారిశుద్ధ్యం, ఇతరత్రా కార్యక్రమాలు చేసుకోవచ్చు. ప్రత్యేకంగా ఎస్సీ, ఎస్టీ వార్డులకు ప్రత్యేక నిధులు మంజూరవుతాయి. వీటి ద్వారా కాలనీలను అభివృద్ధి చేసుకోవచ్చు.

బాన్సువాడ మున్సిపల్‌ కార్యాలయం

బల్దియాలకు ఆదాయమిలా..

మున్సిపాలిటీల్లో ప్రారంభమైన పాలన

వనరులపై పాలకవర్గం దృష్టి సారించేనా

ప్రత్యేక నిధుల వినియోగానికి

ప్రణాళిక అవసరం

పాలకవర్గంపై ప్రజల గంపెడాశలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement