‘సొంతింటి కల సీఎం నెరవేర్చారు’
భిక్కనూరు: సొంతింటి కలను సీఎం రేవంత్‌రెడ్డి నిజం చేశారని కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బద్దం ఇంద్రకరణ్‌రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రకాంత్‌రెడ్డి అన్నారు. శనివారం వారు బస్వాపూర్‌లో ఇందిరమ్మ ఇండ్ల గృహాలను ప్రారంభించి లబ్ధిదారులకు నూతన వస్త్రాలను బహూకరించారు. సర్పంచ్ తుడుం పద్మ స్వామి, నేతలు సిద్ధరాములు, పంచాయతీ కార్యదర్శి దయాకర్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
రామేశ్వర్‌పల్లిలో ఇళ్ల నిర్మాణానికి భూమిపూజ
భిక్కనూరు: రామేశ్వర్‌పల్లిలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి శనివారం భూమి పూజ చేశారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రకాంత్‌రెడ్డి, పీసీసీ ప్రధాన కార్యదర్శి ఇంద్రకరణ్‌రెడ్డి, సర్పంచ్ చేపూరి రాణిరాజు, ఉపసర్పంచ్ వినోద్‌గౌడ్, వీడీసీ అధ్యక్షుడు సూర్యకాంత్‌రెడ్డి పాల్గొన్నారు.
పేదలకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం
దోమకొండ: పేదలకు అండగా ఉండేందుకే కాంగ్రెస్ ప్రభుత్వం ఇల్లు లేని నిరుపేదలకు రూ.5 లక్షలు అందించి ఇంటి నిర్మాణానికి సహకరిస్తోందని మాజీ జెడ్పీటీసీ సభ్యుడు తీగల తిరుమలగౌడ్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు అనంతరెడ్డి అన్నారు. చింతమానుపల్లి గ్రామంలో నీల లక్ష్మీ నవీన్‌కు చెందిన ఇందిరమ్మ ఇల్లు గృహ ప్రవేశ కార్యక్రమంలో వారు పాల్గొని మాట్లాడారు. కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ కార్యదర్శి అబ్రబోయిన స్వామి, ముత్యంపేట సర్పంచ్ అక్షర శ్రీనివాస్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ గోపాల్ రెడ్డి, నాయకులు సీతారాం మధు, శంకర్ రెడ్డి, సంజీవరెడ్డి, శేఖర్, లావణ్య, తదితరులు పాల్గొన్నారు.


