ఎల్లారెడ్డి టీఎన్‌జీవోస్‌ క్యాలెండర్‌ ఆవిష్కరణ | - | Sakshi
Sakshi News home page

ఎల్లారెడ్డి టీఎన్‌జీవోస్‌ క్యాలెండర్‌ ఆవిష్కరణ

Mar 1 2026 7:33 AM | Updated on Mar 1 2026 7:33 AM

ఎల్లారెడ్డి టీఎన్‌జీవోస్‌ క్యాలెండర్‌ ఆవిష్కరణ

ఎల్లారెడ్డి టీఎన్‌జీవోస్‌ క్యాలెండర్‌ ఆవిష్కరణ

ఎల్లారెడ్డి టీఎన్‌జీవోస్‌ క్యాలెండర్‌ ఆవిష్కరణ పెద్దమ్మతల్లి ఆలయంలో చోరీ

ఎల్లారెడ్డి: తెలంగాణ నాన్‌ గెజిటెడ్‌ ఆఫీసర్స్‌ సంఘం(ఎల్లారెడ్డి యూనిట్‌) ఆధ్వర్యంలో నూతన సంవత్సర క్యాలెండర్‌ ఆవిష్కరణ కార్యక్రమం హైదరాబాద్‌ టీఎన్‌జీవో సెంట్రల్‌ కార్యాలయంలో శనివారం ఘనంగా నిర్వహించారు. టీఎన్‌జీవో సెంట్రల్‌ అధ్యక్షులు మారం జగదీశ్వర్‌, సెంట్రల్‌ ప్రధాన కార్యదర్శి ముజీబ్‌ సంయుక్తంగా ఎల్లారెడ్డి యూనిట్‌ క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సెంట్రల్‌ అధ్యక్షులు మాట్లాడుతూ యెల్లారెడ్డి యూనిట్‌ ఐక్యత, సంఘం పట్ల నిబద్ధత అభినందనీయమని అన్నారు. కామారెడ్డి జిల్లా నాయకులు నరాల వెంకట్‌ రెడ్డి, జిల్లా కార్యదర్శి నాగరాజు ఎల్లారెడ్డి యూనిట్‌ అధ్యక్షులు మహిపాల్‌, కార్యదర్శి శరణ్‌ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

నాగిరెడ్డిపేట: మండలంలోని తాండూర్‌ గ్రామ శివారులో ఉన్న పెద్దమ్మతల్లి ఆలయంలో శుక్రవారం రాత్రి దుండగులు చోరీకి పాల్పడ్డారు. ఆలయ ఆవరణలో ఏర్పాటు చేసిన హుండీని నేల నుంచి పెకలించి దానికి ఉన్న రంధ్రం ద్వారా నగదును అపహరించారు. ఎస్సై ఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement