పింఛన్ డబ్బుల కోసం తల్లి హత్య
● తాగుడికి బానిసైన కుమారుడి ఘాతుకం
● కోటగిరిలో దారుణ ఘటన
రుద్రూర్: మద్యానికి బానిసైన కుమారుడు తన తల్లిని హతమార్చిన ఘటన కోటగిరి మండల కేంద్రంలో చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కోటగిరి మండల కేంద్రానికి చెందిన పద్మశాలి మానాజీ మద్యానికి అలవాటుపడి తరచూ తన తల్లి భూమవ్వ(70)తో గొడవ పడేవాడు. ఆమె పింఛన్ డబ్బులు ఇవ్వాలని, ఇల్లు అమ్మాలని ఒత్తిడి తెచ్చేవాడు. అయితే భూమవ్వ ఇందుకు నిరాకరించడంతో వివాదాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో శుక్రవారం రాత్రి మానాజీ కల్లు సీసాతో తల్లి తలపై కొట్టి, అనంతరం రోకలి కర్రతో దాడి చేశాడు. తీవ్ర గాయాలతో భూమవ్వ అక్కడికక్కడే మృతి చెందింది. అర్ధరాత్రి సమయంలో ఇంట్లో దీపంలో ఉన్న నూనెను భూమవ్వ ఒంటిపై పోసి నిప్పంటించాడు. దీంతో మెడ భాగం, రెండు కాళ్లు మోకాళ్ల వరకు కాలిన గాయాలు ఏర్పడ్డాయి. శనివారం ఘటన స్థలాన్ని రుద్రూర్ సీఐ కృష్ణకుమార్, ఎస్సై సునీల్ సందర్శించి వివరాలు తెలుసుకున్నారు. నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరంచినట్లు ఎస్సై పేర్కొన్నారు. కుమార్తె మాధవ్వ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నట్లు ఎస్సై తెలిపారు. మృతురాలు నిరుపేద కావడంతో జీపీ ఆధ్వర్యంలో అంత్యక్రియలు నిర్వహించారు.
పింఛన్ డబ్బుల కోసం తల్లి హత్య


