కోడింగ్‌లో జ్యోతీబా పూలే విద్యార్థుల ప్రతిభ | - | Sakshi
Sakshi News home page

కోడింగ్‌లో జ్యోతీబా పూలే విద్యార్థుల ప్రతిభ

Mar 1 2026 7:33 AM | Updated on Mar 1 2026 7:33 AM

కోడింగ్‌లో జ్యోతీబా పూలే విద్యార్థుల ప్రతిభ

కోడింగ్‌లో జ్యోతీబా పూలే విద్యార్థుల ప్రతిభ

భిక్కనూరు: జంగంపల్లిలోని మహత్మా జ్యోతిబా పూలే గురుకుల పాఠశాల విద్యార్థులు కోడింగ్‌ విత్‌ ఔట్‌ కంప్యూటర్స్‌ హకథాన్‌లో ప్రథమ స్థానం పొంది పలువురి ప్రశంసలు పొందారు. దోమకొండకు చెందిన దేవరగట్టు బాలప్రసాద్‌ ఆధ్వర్యంలో కాగ్నిజెంట్‌ సాఫ్ట్‌వేర్‌ సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులు స్వప్న, స్వాతి, పవన్‌, నవీన్‌, ఆనంద్‌లు వారాంతం సెలవుల్లో ఈ పాఠశాలకు వచ్చి విద్యార్థులకు కోడింగ్‌పై శిక్షణ ఇచ్చారు. శనివారం హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో ఈ పాఠశాల విధ్యార్థులు అత్యుత్తమ ప్రతిభను కనబరిచి ప్రథమ బహుమతి పొందారు. విద్యార్థులను ఎంజేపీ కార్యదర్శి సైదులు, ఆర్‌సీవో సత్యనాథ్‌రెడ్డి, పాఠశాల ప్రిన్సిపాల్‌ శ్రీలత అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement