నంబర్ వన్ స్థానంలో జిల్లా..
సీ్త్రనిధి రుణాల పంపిణీలో రాష్ట్రంలోనే కామారెడ్డి జిల్లా నంబర్ వన్ స్థానంలో నిలిచిందని డీఆర్డీవో సురేందర్ తెలిపారు. ఐకేపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. జిల్లాలో ఈ ఏడాది సీ్త్రనిధి ద్వారా రూ.70 కోట్ల 47లక్షల రుణ పంపిణీ లక్ష్యం కాగా.. ఇప్పటివరకు రూ.73 కోట్ల 39లక్షల రుణాలు అందజేశామన్నారు. రుణ పంపిణీని 104శాతం పూర్తిచేసి రాష్ట్రంలోనే జిల్లా నంబర్ వన్ స్థానంలో నిలిచిందన్నారు. అలాగే రుణాల రికవరీలో నాగిరెడ్డిపేట మండలం వెనుకబడి ఉందన్నారు. బకాయిల వసూళ్ల కోసం గ్రామాల్లో మహిళాసంఘాల సభ్యులతో స్పెషల్ డ్రైవ్ చేపడతామన్నారు. జిల్లాలో బ్యాంకు లింకేజీ రుణాలకు సంబంధించి 98శాతం రికవరీ చేశామని ఆయన చెప్పారు. కాగా రుణాల రికవరీలో వెనకబడిన జిల్లాలోని 36మంది వీవోఏలకు షోకాజ నోటీసులను అందజేశామన్నారు. ఉపాధిహామీ పథకంలో భాగంగా ఈ ఏడాది జిల్లాలోని కూలీలకు 22లక్షల పనిదినాలు కల్పించాల్సి ఉండగా ఇప్పటివరకు 14లక్షల పనిదినాలను కల్పించామన్నారు. మరో 8లక్షల పనిదినాలను కల్పించాల్సి ఉందని ఆయన చెప్పారు. ప్రస్తుతం ప్రతి గ్రామపంచాయతీకి 120మంది కూలీలు రావాలని లక్ష్యంగా నిర్ణయించామన్నారు. సీ్త్రనిధి జిల్లా మేనేజర్ కిరణ్, బ్యాంకులింకేజీ డీపీఎం రాజయ్య, సీసీలు తదితరులు పాల్గొన్నారు.


