యూరియా సరఫరా
బాన్సువాడ రూరల్: ‘యూరియా ఇక్కట్లు..యాప్‌తో పాట్లు’ అనే శీర్షికన గురువారం సాక్షి మెయిన్‌లో ప్రచురితమైన వార్తకు జిల్లా వ్యవసాయ అధికారి మోహన్‌రెడ్డి స్పందించారు. బాన్సువాడ మండలం తాడ్కోల్ సహకార సంఘం అధికారులతో మాట్లాడారు. బుడిమి, కొత్తాబాది, తిర్మలాపూర్ గ్రామాల కు చెందిన రైతులకు వెంటనే 335 బస్తాల యూరియాను అందజేశారు. స్థానిక రైతులకు యూరియ అందించాలనే ఉద్ధేశంతో రాత్రి స్లాట్ బుకింగ్ ప్రారంభించినట్లు సహకార అధికారులు తెలిపారన్నారు. యాప్‌లో యూరియా బుకింగ్ చేసుకోవడానికి వచ్చిన రైతులు వారికి సహయం చేయడానికి వచ్చిన యువకులు బుడిమి గ్రామంలో ఒకే చోట చేరడంతో సమస్య తలెత్తినట్లు తెలిపారు.


