రహదారుల అభివృద్ధికి నిధులు కేటాయించాలి
కామారెడ్డి టౌన్ : జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని రహదారుల అభివృద్ధికి సరిపడా నిధులు కేటాయించాలని ఎంపీ సురేశ్‌కుమార్ షెట్కార్ కేంద్ర రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీని కోరారు. గురువారం ఢిల్లీలో మంత్రిని కలిసి వినతిపత్రం అందజేశారు. కామారెడ్డి, సంగారెడ్డి జిల్లాల్లో కొత్త జాతీయ రహదారుల నిర్మాణం, పెండింగ్‌లో ఉన్న బ్రిడ్జిల పనుల ఆవశ్యకతను కేంద్ర మంత్రికి వివరించారు. నియోజకవర్గంలో రవాణా సౌకర్యాన్ని మెరుగుపర్చడం ద్వారా ఆర్థిక అభివృద్ధికి బాటలు పడతాయని, నూతన రహదారులను మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించినట్లు ఎంపీ తెలిపారు. ఎంపీ వెంట నారాయణఖేడ్ మున్సిపల్ చైర్మన్ నగేశ్‌కుమార్ తదితరులున్నారు.
కామారెడ్డి టౌన్: జుక్కల్ నియోజకవర్గంలో అమలవుతున్న అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాల పురోగతిపై ఎమ్మెల్యే లక్ష్మీకాంతారా వు కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్‌తో గురువారం క లెక్టరేట్‌లో సమీక్ష నిర్వహించారు. వివిధ శా ఖల పనుల స్థితిగతులపై సుదీర్ఘంగా చర్చించారు. వైద్యారోగ్య శాఖ, గృహనిర్మాణం, సాగునీరు, అటవీ, పర్యాటక శాఖలకు సంబంధించిన ప్రాజెక్టుల పురోగతిని ఎమ్మెల్యే అడిగి తెలుసుకున్నారు. నియోజకవర్గంలో పెండింగ్‌లో ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేసి, ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని అధికారులను కోరారు. జుక్కల్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు యంత్రాంగం సహకరించాలని ఆయన కోరారు. అదనపు కలెక్టర్ విక్టర్ పాల్గొన్నారు.
మాచారెడ్డి: రాష్ట్రస్థాయి టచ్ రగ్బీ పోటీలకు సోమారంపేట పాఠశాలకు చెందిన విద్యార్థులు ఎంపికయ్యారు. హైదరాబాద్ విక్టరీ మెమోరియల్ హోం రెసిడెన్షియల్ పాఠశాలలో శుక్రవారం నిర్వహించనున్న పోటీల్లో పాల్గొనేందుకు ఉన్నత పాఠశాలకు చెందిన నలుగురు బాలికలు, నలుగురు బాలురు బయల్దేరి వెళ్లినట్లు పీడీ సంధ్య తెలిపారు. పీడీని హెచ్‌ఎం సుర భాస్కర్‌తోపాటు సర్పంచ్ మమత, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్ పర్సన్ సునీత అభినందించారు.
కామారెడ్డి టౌన్: డిప్లొమా అగ్రికల్చర్ ఎక్స్‌టెన్షన్ సర్వీస్ ఇన్‌పుట్ డీలర్స్ ప్రొగ్రామ్ కింద ఏడాది కాలం శిక్షణ పూర్తి చేసుకున్న 120 మంది ఇన్‌పుట్ డీలర్లకు కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ గురువారం కలెక్టరేట్‌లో సర్టిఫికెట్లు అందజేశారు. 2023–24 బ్యాచ్‌కు సంబంధించి బిచ్కుంద, బాన్సువాడ, ఎల్లారెడ్డిల నుంచి 40 మంది చొప్పున డీలర్లు శిక్షణను పూర్తి చేసుకున్నారు. శిక్షణలో నేర్చుకున్న అంశాలతో రైతులకు మెరుగైన సేవలందించాలని కలెక్టర్ సూచించారు. అనంతరం ఫెర్టిలైజర్ యాప్ పనితీరు, రైతు బీమా అమలుపై ఏడీఏలు, ఎంఏవోలతో సమీక్ష నిర్వహించారు. రైతు బీమాకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న క్లెయిమ్స్‌ను త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. రైతు కుటుంబాలకు బీమా సొమ్ము త్వరగా అందేలా చూడాలన్నారు.
రహదారుల అభివృద్ధికి నిధులు కేటాయించాలి
రహదారుల అభివృద్ధికి నిధులు కేటాయించాలి
రహదారుల అభివృద్ధికి నిధులు కేటాయించాలి


