‘మన సీ్త్రనిధి’తో సులభంగా రుణాలు
● ఈజీగా వాయిదాల చెల్లింపులు
● అక్రమాలకు అడ్డుకట్ట పడే అవకాశం
● ప్రత్యేక యాప్‌పై అవగాహన
కల్పిస్తున్న అధికారులు
బాన్సువాడ రూరల్: స్వయం సహాయక సంఘాల సభ్యుల కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా ‘మన స్త్రీనిధి’ యాప్‌ను రూపొందించింది. ఈ యాప్ ద్వారా సాధారణ రుణాలతోపాటు వ్యాపారాలు చేసుకునేందుకు రుణాలు మంజూరు చేస్తూ ఆర్థిక చేయూతనిస్తోంది. రుణాల పంపిణీ, చెల్లింపు విషయంలో జరుగుతున్న మోసాలు, వైఫల్యాలను అరికట్టేందుకు ఈ యాప్‌ను ప్రవేశపెట్టింది. ఇక మీదట రుణ మంజూరుతోపాటు రుణాలు పొందిన మహిళలు నేరుగా యాప్ ద్వారానే కిస్తీలు చెల్లించుకునే అవకాశం ఉంది. దీంతోపాటు తాము చెల్లించిన సొమ్ము సక్రమంగా జమ అయ్యిందా లేదా అని సరిచూసుకునే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఈ యాప్‌పై అధికారులు, సీ్త్రనిధి బ్యాంక్ సిబ్బంది సభ్యులకు అవగాహన కల్పిస్తున్నారు.
సమగ్ర సమాచారం..
మన సీ్త్రనిధి యాప్ ద్వారా సభ్యులు అక్రమాల బారిన పడే అవకాశం ఉండదు. అలాగే రుణం తీసుకున్న సభ్యులు తాము పొందిన రుణాలు తిరిగి చెల్లిస్తున్నారో లేదో తెలుసుకోవచ్చు. తీసుకున్న రుణం, చెల్లింపులు, ఇంకా ఎంత చెల్లించాల్సి ఉందనే సమగ్ర సమాచారం యాప్‌లో ఉంటుంది. రుణాల కిస్తీలు చెల్లించేందుకు బ్యాంకుల వద్ద పడిగాపులు కాయాల్సిన అవసరం ఉండదు.
రుణాలు నేరుగా ఖాతాలోకి..
సభ్యురాలు ‘మన స్త్రీనిధి’ యాప్‌లో రుణం కోసం దరఖాస్తు చేసుకోగానే వీవోఏకు సమాచారం వెళ్తుంది. 24 గంటల వ్యవధిలో వీఏవో అప్రువల్ చేయాల్సి ఉంటుంది. అప్రూవల్ చేయకుంటే దరఖాస్తు అటోమెటిక్‌గా ఏపీఎం లాగిన్‌కు వెళ్తుంది. ఏపీఎం పరిశీలించి అసిస్టెంట్ మేనేజర్‌కు అక్కడి నుంచి రీజినల్ మేనేజర్‌కు పంపుతారు. అక్కడ ఆమోదం లభించగానే రుణం నేరుగా సభ్యురాలి ఖాతాలో జమ అవుతుంది. ఈ విధానంతో స్వయం సహాయక సంఘాల సభ్యులు వీవోఏ, సీసీల చుట్టూ తిరగడం తప్పుతుంది. జిల్లాలో 20 శాతం అమల్లోకి వచ్చిన ఈ యాప్ గేమ్‌ఛేంజర్‌గా నిలిచే అవకాశం ఉండటంతో అటు అధికారులు, ఇటు స్వయం సహాయక సంఘాల మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
స్వయం సహాయక సంఘాలు ‘మన సీ్త్రనిధి’ యాప్‌ను సద్వినియోగం చేసుకోవాలి. యాప్‌లో బహుళ ప్రయోజనాలు ఉన్నాయి. సభ్యులకు ప్రయోజనం చేకూరడంతోపాటు అక్రమాలకు అడ్డుకట్ట పడుతుంది. యాప్‌పై మహిళా సంఘాలకు, సిబ్బందికి అవగాహన కల్పిస్తున్నాం.
– కిరణ్,
సీ్త్రనిధి రీజినల్ మేనేజర్, కామారెడ్డి


