ఆదర్శ పాఠశాల రమ్మంటోంది.. | - | Sakshi
Sakshi News home page

ఆదర్శ పాఠశాల రమ్మంటోంది..

Feb 23 2026 7:38 AM | Updated on Feb 23 2026 7:38 AM

ఆదర్శ పాఠశాల రమ్మంటోంది..

ఆదర్శ పాఠశాల రమ్మంటోంది..

సద్వినియోగం చేసుకోవాలి

6 నుంచి 10 తరగతుల్లో

ప్రవేశానికి దరఖాస్తులు

ఈ నెల 28 వరకు అవకాశం

ఏప్రిల్‌ 19న ప్రవేశ పరీక్ష

బాన్సువాడ రూరల్‌: గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఆంగ్ల మాధ్యమంలో విద్యనందించేందుకు ‘ఆదర్శ పాఠశాల’లు దోహదపడుతున్నాయి. ప్రయివేటు, కార్పొరేట్‌ పాఠశాలల్లో వేలాది రూపాయల ఫీజులు చెల్లించలేని పేద, మధ్యతరగతి కుటుంబాల పిల్లలకు ఇంగ్లిష్‌ మీడియంలో ఉచిత విద్య అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ పాఠశాలలను నెలకొల్పింది. ప్రస్తుతం మాడల్‌ స్కూల్స్‌లో అడ్మిషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. 6వ తరగతిలో పూర్తి సీట్లతోపాటు 7 నుంచి 10 తరగతి వరకు ఉన్న బ్యాక్‌లాగ్‌ సీట్లను భర్తీ చేసేందుకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తున్నారు.

జిల్లాలో ఆరు పాఠశాలలు..

కామారెడ్డి జిల్లాలో ఆరు మాడల్‌ స్కూల్స్‌ ఉన్నా యి. బాన్సువాడ మండలంలోని కొత్తాబాది, సదాశివనగర్‌, నాగిరెడ్డిపేట్‌, ఎల్లారెడ్డి, నిజాంసాగర్‌, మద్నూర్‌ మండలంలోని మేనూర్‌ గ్రామాల్లో ఉన్నాయి. ఒక్కో పాఠశాలలో ఆరో తరగతిలో వంద మంది విద్యార్థులకు ప్రవేశం కల్పిస్తున్నారు. దీంతో పాటు 7 నుంచి 10వ తరగతి వరకు ఖాళీగా ఉ న్న సీట్లను భర్తీ చేయనున్నారు.

దరఖాస్తు ఇలా..

ఆదర్శ పాఠశాలల్లో ప్రవేశానికి https:// telanga nams.cgg.gov.in వెబ్‌సైట్‌లో ఈ నెల 28వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలి. విద్యార్థి పాస్‌పోర్టు సైజ్‌ ఫొటో, ఆధార్‌ కార్డు, బోనాఫైడ్‌ అవసరం ఉంటుంది. దరఖాస్తు పత్రంతోపాటు కుల ధృవీకరణపత్రం, ఆధార్‌ కార్డు, బోనాఫైడ్‌ జిరాక్సు ప్రతులను ప్రవేశం కోసం నమోదు చేసుకున్న పాఠశాల ప్రిన్సిపల్‌కు అందజేయాలి. జనరల్‌ కేటగిరి విద్యార్థులు రూ.200, ఈడబ్ల్యూఎస్‌, దివ్యాంగులు, బీసీ, ఎస్సీ, ఎస్టీలకు రూ.125 దరఖాస్తు రుసుము చెల్లించాల్సి ఉంటుంది. ఏప్రిల్‌ 19న ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. ఈ పరీక్ష మొత్తం ఆబ్జెక్టివ్‌ విధానంలో ఉంటుంది. తెలుగు, గణితం, సైన్స్‌, సోషల్‌, ఇంగ్లిష్‌ సబ్జెక్టుల నుంచి 100 ప్రశ్నలు అడుగుతారు. ఒక్కో సమాధానానికి ఒక్కో మార్కు ఉంటుంది.

విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకో వాలి. ఎంపిక ప్రక్రియ అత్యంత పారదర్శకంగా ఉంటుంది. సీట్ల్ల భర్తీలో స్థానిక విద్యార్థులకు ప్రాధాన్యత ఉంటుంది. ఆసక్తి, అర్హత ఉన్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలి.

– కమల్‌కిశోర్‌, ప్రిన్సిపాల్‌, కొత్తాబాది

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement