సీఎం కప్ పోటీల్లో సత్తా చాటిన జిల్లా జట్లు
● సెపక్‌తక్రాలో ద్వితీయ స్థానం
● హాకీ పోటీల్లో తృతీయస్థానం
కామారెడ్డి అర్బన్ : సీఎం కప్ రాష్ట్రస్థాయి పోటీల్లో జిల్లా జట్ల క్రీడాకారులు తమ సత్తా చాటి బహు మతులు సాధించినట్లు జిల్లా యువజన క్రీడల అ ధికారి రంగా వెంకటేశ్వరగౌడ్ ఒక ప్రకటనలో తెలి పారు. విషయం తెలుసుకున్న కలెక్టర్ ఆశిష్ సంగ్వా న్ వారిని అభినందించినట్టు పేర్కొన్నారు. రోయింగ్ సింగిల్స్, డబుల్స్‌లో రేపల్లి విద్యాసాయి వెండి,బంగారు పతకాలతోపాటు నగదు బహుమతి సా ధించిదన్నారు. బాక్సింగ్ 52 కిలోల విభాగంలో క్షితిజ బంగారు పతకంతోపాటు రూ.20వేల నగదు బహుమతి పొందిందన్నారు. అథ్లెటిక్స్ లాంగ్ జంప్‌లో శ్రీనిధి వెండి పతకం, రూ.15వేల నగదు, అండర్–20 లాంగ్ జంప్‌లో పరశురామ్ బంగారు పత కం, రూ.20వేల నగదు, జావెలిన్‌త్రోలో అమృత కాంస్య పతకం, రూ.పదివేల నగదు, 800 మీటర్ల పరుగులో ఈశ్వర్ వెండి పతకం, రూ.పదివేల నగ దు, యోగా అండర్–19లో సీహెచ్ సహస్ర బంగా రు పతకం, రూ.20వేల నగదు, యోగా ట్రెడిషనల్ లో సింధూజ బంగారు పతకం, రూ.20వేల నగదు, అండర్–14 విభాగంలో జి.సునీత బంగారు పతకం, రూ.20 వేల నగదు, జి.కవిత, శిరీషలు వెండి పతకం, రూ.15వేల నగదు, సెపక్ తక్రాలో మహిళల జట్టు వెండి పతకంతో పాటు రూ.75వేల నగ దు, రెస్లింగ్ 30–40 కిలోల విభాగంలో జ్యోతి కాంస్య పతకం, రూ.పదివేల నగదు, సబ్ జూనియర్ బాలుర విభాగంలో అనిల్, ప్రవీఫ్‌లు కాంస్య పతకం, రూ.పదివేల నగదు బహుమతులు, హాకీలో తృతీయ స్థానంతో పాటు రూ.50 వేల నగదు, నెట్ బాల్ బాలుర విభాగంలో తృతీయ స్థానం పొందినట్టు వెంకటేశ్వరగౌడ్ వివరించారు. అలాగే క్రీడాకారులను జిల్లాలోని క్రీడాకారులు, వివిధ క్రీడా సంఘాల ప్రతినిధులు అభినందించారు.


