శ్రీకృష్ణ ధ్యాన మందిర వార్షికోత్సవం
కామారెడ్డి అర్బన్: కామారెడ్డి శ్రీనివాస్‌నగర్‌లోని శ్రీకృష్ణధ్యాన మందిరం 15వ వార్షికోత్సవం సందర్భంగా ఆదివారం సాయంత్రం పీఠాధిపతి గాంధారికర్ బాబా ఆధ్వర్యంలో విశేష పూజలు, అభిషేకాలు, అర్చనలు భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. ఆలయ ధర్మ పతాకం ఆవిష్కరించారు. వేడుకల్లో అఖిల భారత మహానుభావు పరిషత్ జాతీయ అధ్యక్షుడు మచాలే బాబా, మున్సిపల్ చైర్‌పర్సన్ ఉప్ప ఉమారాణి, వార్డు కౌన్సిలర్లు సురోజు వనిత, వినోద, ఆలయ కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు.
కొలనుపాకకు పాదయాత్ర
నిజాంసాగర్(జుక్కల్): సద్గురు బండాయప్ప మఠం ఆధ్వర్యంలో భక్తులు కొలనుపాకకు బిచ్కుంద పట్టణం నుంచి పాదయాత్ర చేపట్టారు. ఆదివారం మహమ్మద్ నగర్ మండల కేంద్రానికి వచ్చిన పాదయాత్ర భక్తులకు జెడ్పీ మాజీ చైర్మన్ దపేధార్ రాజు కుటుంబీకులు అన్నప్రసాదం ఏర్పాటు చేశారు. యాదాద్రి జిల్లాలోని కొలనుపాక స్వయంభూ రేణుకాచార్యుల దర్శనం కోసం భక్తులు ప్రతి ఏటా పాదయాత్రగా వెళ్తున్నారు.
ఎల్లారెడ్డిలో..
ఎల్లారెడ్డి: లోక కల్యాణార్థం మహాపాదయాత్ర నిర్వహిస్తున్నట్లు నాగభూషణం స్వామి అన్నారు. సద్గు రు సిద్ధి లింగప్ప స్వామి వారి ఆధ్వర్యంలో మహాపాదయాత్ర కార్యక్రమం ఆదివారం రాత్రి ఎల్లారెడ్డికి చేరింది. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ..సనాతన హిందూ ధర్మ జాగృతి కోసం పాద యాత్ర కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. ఈనెల 20న ప్రారంభమైన పాదయాత్ర కొలనుపాకకు చేరుతుందన్నారు. వీరశైవ లింగాయత్ సంఘం అధ్యక్షులు వీరప్ప, బసప్ప, తదితరులున్నారు.
సత్యసాయి సేవా కేంద్రంలో భజనలు
కామారెడ్డి అర్బన్: సత్యసాయిబాబా శత జయంతి సందర్భంగా స్థానిక అయ్యప్పనగర్‌లోని సత్యసాయి సేవా కేంద్రంలో భక్తులు భజనలు నిర్వహించి అనంతరం తీర్థప్రసాదాలు అందజేశారు. స్థానిక జిల్లా ఆస్పత్రిలో సేవా సమితి నుంచి ఏర్పాటు చేసిన తాగునీటి ట్యాంకులను శుభ్రం చేశారు. ప్రతినిధులు లింబాద్రి, భాస్కరశర్మ, శ్రీనివాస్, రాములు, విఠల్, అశోక్‌కుమార్, స్వప్న, కృష్ణకుమారి, లక్ష్మి, సునీత తదితరులు పాల్గొన్నారు.
భక్తిశ్రద్ధలతో బోనాల జాతర
నిజాంసాగర్(జుక్కల్): అమ్మాబైలెల్లినాదో తల్లీ బైలెల్లింది అంటూ శివసత్తుల పూనకాలు, యువకుల నృత్యాలు, డీజే ఆటాపాటలతో బోనాల జాతర దద్దరిల్లింది. ఆదివారం గోర్గల్‌లో గ్రామస్తులు బేడీల మైసమ్మ ఆలయం వరకు బోనాల ఊరేగింపు నిర్వహించారు. అమ్మవారి ఆలయ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ఆలయ కమిటీ ఆధ్వర్యంలో పండుగలు జరుపుతున్నారు. ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు రెడ్డిశెట్టి భాస్కర్, వీరేశం.. మకరతోరణం, స్నేహ కంపెనీ నిర్వాహకుడు.. వెండి కిరీటం, ఒడ్డేపల్లి రాజు.. వెండిత్రిశూలాన్ని అమ్మవారికి సమర్పించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో దాతలను ఘనంగా సన్మనించారు. నాయకులు దుర్గారెడ్డి, శ్రీకాంత్‌రెడ్డి, దుర్గయ్య, రామాగౌడ్, లక్ష్మణ్ వేదపండితుడు సంజీవ్‌రావ్ శర్మ, గ్రామస్తులు పాల్గొన్నారు.
బ్రాహ్మణపల్లిలో ప్రత్యేక పూజలు
తాడ్వాయి(ఎల్లారెడ్డి): బ్రాహ్మణపల్లిలోని హన్‌మాన్ ఆలయంలో హన్‌మాన్ స్వాములు ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే భక్తి శ్రధ్ధలతో భజనలు చేశారు.అనంతరం భిక్ష ఏర్పాటు చేశారు.
ఆధ్యాత్మికం
శ్రీకృష్ణ ధ్యాన మందిర వార్షికోత్సవం
శ్రీకృష్ణ ధ్యాన మందిర వార్షికోత్సవం
శ్రీకృష్ణ ధ్యాన మందిర వార్షికోత్సవం
శ్రీకృష్ణ ధ్యాన మందిర వార్షికోత్సవం
శ్రీకృష్ణ ధ్యాన మందిర వార్షికోత్సవం


