అ‘పూర్వ’ సమ్మేళనం
నందిపేట నవోదయ హై స్కూల్ పూర్వ విద్యార్థులు
ఆర్మూర్ జెడ్పీ ఉన్నత పాఠశాల పూర్వ విద్యార్థులు
ఆర్మూర్‌టౌన్/ నందిపేట్/ నవీపేట/ లింగపేట: ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పదో తరగతి పూర్వ విద్యార్థులు ఆదివారం అపూర్వ సమ్మేళనాలు చేపట్టారు. ఆర్మూర్ పట్టణంలోని జెడ్పీ ఉన్నత బాలుర పాఠశాలకు చెందిన 1975–76 పదో తరగతి పూర్వ విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. విద్యాబుద్ధులు నేర్పిన గురువులను ఘనంగా సన్మానించారు. నందిపేట్ మండల కేంద్రంలోని నవోదయ హై స్కూల్‌కు చెందిన 2001–02 పదో తరగతి విద్యార్థులు అపూర్వ సమ్మేళనం చేపట్టారు. కార్యక్రమంలో ఎంఈవో అవదూత గంగాధర్, ఉపాధ్యాయులు, పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు. నవీపేట మండలం నాళేశ్వర్ గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు చెందిన 2016–17 పదో తరగతి విద్యార్థులు అపూర్వ సమ్మేళనం నిర్వహించారు. ఉపాధ్యాయులు సునీత, గంగాధర్, నవీన్ తదితరులు పాల్గొన్నారు. లింగంపేట మండలంలోని శెట్పల్లిసంగారెడ్డి ఉన్నత పాఠశాలకు చెందిన 2005–06 పదో తరగతి పూర్వ విద్యార్థులు ఆత్మీ య సమ్మేళనం నిర్వహించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు సంగమేశ్వర్, రవీందర్, శ్రీనివాస్, ఇందిర, నర్సింలు, పూర్వ విద్యార్థులు కిరణ్, సాయిబాబా, రాజు, సంతు, ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.
నాళేశ్వర్ ఉన్నత పాఠశాల పూర్వ విద్యార్థులు
శెట్పల్లి సంగారెడ్డి ఉన్నత పాఠశాల విద్యార్థులు
అ‘పూర్వ’ సమ్మేళనం
అ‘పూర్వ’ సమ్మేళనం
అ‘పూర్వ’ సమ్మేళనం


