మూడు ఆలయాల్లో చోరీ
నవీపేట: మండల కేంద్రంలోని మూడు ఆలయాల్లో దుండగులు శనివారం రాత్రి దొంగతనానికి పాల్పడ్డారు. అయ్యప్ప ఆలయ తాళాలు పగుల గొట్టి లోపలికి ప్రవేశించారు. గర్భగుడి ముందు ఉన్న హుండీని పగులగొట్టి అందులోని నగదును ఎత్తుకెళ్లారు. గర్భగుడి తాళాలు పగులగొట్టేందుకు యత్నించి విఫలమయ్యారు. పెద్దమ్మ తల్లి ఆలయ ప్రధాన ద్వారం తాళాలు పగులగొట్టి లోపలికి వెళ్లారు. అర తులం బంగారు, రెండు తులాల వెండి ఆభరణాలు, హుండీని ఎత్తుకెళ్లారు. అలాగే పక్కనే ఉన్న రేణుక ఎల్లమ్మ ఆలయంలోకి ప్రవేశించి హుండీని ఎత్తుకెళ్లి అందులో ఉన్న నగదును దొంగిలించి హుండీలను శివారులోని పంట పొలాల్లో పడేశారు. క్లూస్ టీమ్ ఆలయాల్లో వేలిముద్రలను సేకరించింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్రీకాంత్ తెలిపారు.
నిజామాబాద్ అర్బన్: సీఎం కప్ రాష్ట్రస్థాయి బాస్కెట్‌బాల్ పోటీలు మూడో రోజు ఆదివారం కొనసాగాయి. ఉదయం నిర్వహించిన బాలికల క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో హైదరాబాద్ జట్టు కరీంనగర్ పై, నిజామాబాద్ జట్టు మహబూబ్‌గర్ పై, రంగారెడ్డి జట్టు మేడ్చల్ మల్కాజిగిరి పై, జగిత్యాల జట్టు వరంగల్ పై విజయం సాధించి సెమీఫైనల్స్ చేరాయి. క్వార్టర్స్ బాలుర విభాగంలో హైదరాబాద్ జ ట్టు మహబూబ్‌నగర్ పై, మహబూబాబాద్ జ ట్టు ఆదిలాబాద్ పై, రంగారెడ్డి జట్టు నిజామాబాద్ జట్టు పై, జగిత్యాల జట్టు కరీంనగర్ పై, బాలికల విభాగంలో హైదరాబాద్–రంగారెడ్డి, బాలుర విభాగంలో రంగారెడ్డి–హైదరాబాద్ జట్లు ఫైనల్‌కు చేరాయి. ఈ సందర్భంగా జిల్లా సంక్షేమ అధికారిణి పద్మ క్రీడాకారులను అభినందించారు. క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించాలని ఆకాంక్షించారు.
నేడు ఫైనల్ మ్యాచ్
సీఎం కప్ బాస్కెట్‌బాల్ రాష్ట్ర స్థాయి ఫైనల్ మ్యాచ్ సోమవారం నిర్వహించనున్నారు. మ్యాచ్‌లో బాలి కల విభాగంలో రంగారెడ్డి, హైదరాబాద్, బాలుర విభాగంలో రంగారెడ్డి–హైదరాబాద్ జట్లు తలపడనున్నాయి. సాయంత్రం సీఎం కప్ బాస్కెట్‌బాల్ రాష్ట్ర స్థాయి క్రీడలు ముగింపు జరుగనుంది.
మూడు ఆలయాల్లో చోరీ


