నేడు మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ బాధ్యతల స్వీకరణ | - | Sakshi
Sakshi News home page

నేడు మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ బాధ్యతల స్వీకరణ

Feb 23 2026 7:38 AM | Updated on Feb 23 2026 7:38 AM

నేడు

నేడు మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ బాధ్యతల స్వీకరణ

నేడు మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ బాధ్యతల స్వీకరణ

కామారెడ్డి టౌన్‌: కామారెడ్డి మున్సిపల్‌ చైర్‌పర్సన్‌గా నూతనంగా ఎన్నికై న ఇప్ప ఉమారాణి సోమవారం ఉదయం 10: 30 గంటలకు పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు. ఇందుకు సంబంధించి మున్సిపల్‌ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. కార్యాలయం మొదటి అంతస్తులో ఆమె కోసం ప్రత్యేక చాంబర్‌ను సిద్ధం చేశారు. బాధ్యతల స్వీకరణ అనంతరం మున్సిపల్‌ అధికారులు, సిబ్బందితో ఆమె పరిచయ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఆ తర్వాత పట్టణంలోని ప్రధాన సమస్యలపై అధికారులతో సమీక్ష సమావేశం జరుపనున్నారు.

కలెక్టరేట్‌కు

ఆధారాలతో వస్తాం

కామారెడ్డి టౌన్‌ : ప్రభుత్వ కళాశాల భూ ముల ఆక్రమణలపై సోమవారం ఆధారాలతో కలెక్టరేట్‌కు వస్తామని ఎన్‌ఎస్‌యూఐ జిల్లా అధ్యక్షుడు ఐరేని సందీప్‌ తెలిపారు. ప ట్టణంలోని కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయం వద్ద ఆదివారం ఆయన మాట్లాడారు. ఎమ్మెల్యే కలెక్టరేట్‌కు రావడాన్ని తాము స్వాగతిస్తున్నామన్నారు. కళాశాల భూములు ఏవిధంగా అన్యాక్రాంతమయ్యాయో, అందులో ఎవరి హస్తం ఉందో నిరూపించడానికి తమ వద్ద పూర్తిస్థాయి సాక్ష్యాధారాలు ఉన్నాయని తెలిపారు.

ఎమ్మెల్యే జోలికి వస్తే ఊరుకోం

కామారెడ్డి టౌన్‌: కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణ రెడ్డి జోలికి వస్తే ఊరుకు నేది లేదని బీజేపీ జిల్లా అధ్యక్షుడు నీలం చి న్న రాజులు హెచ్చరించారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఆదివారం ఏ ర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆ యన మాట్లాడారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై కాంగ్రెస్‌ శ్రేణులు జరిపిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఎమ్మెల్యే రమణారెడ్డికి ప్రాణహాని ఉందని, ఆయనకు తగిన రక్షణ కల్పించాలని డిమాండ్‌ చేశారు. ఎమ్మెల్యేకు మద్దతుగా వస్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు, ఎంపీ ఈటల రాజేందర్‌, ఇతర ఎమ్మెల్యేలను మార్గమధ్యలోనే పోలీసులు అక్రమంగా అరెస్ట్‌ చేశారని మండిపడ్డారు. కాంగ్రెస్‌ నాయకులు తీరు మార్చుకోకుంటే ప్రజలే తగిన బుద్ధి చెబుతారన్నారు. కౌన్సిలర్లు శ్రీధర్‌రెడ్డి, కుంట లక్ష్మారెడ్డి, నాయకులు శ్రీనివాస్‌, వెంకట్‌రెడ్డి, నిహాల్‌ తదితరులున్నారు.

నేడు మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ బాధ్యతల స్వీకరణ 
1
1/1

నేడు మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ బాధ్యతల స్వీకరణ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement