భిక్కనూరు : దక్షిణ కాశీగా పేరొందిన భిక్కనూరు సిద్దరామేశ్వరస్వామి కల్యాణాన్ని అర్చకులు సోమవారం వైభవంగా నిర్వహించారు. ఈకార్యక్రమానికి భక్తులు భారీగా తరలివచ్చారు. వేదబ్రాహ్మణులు సిద్దగిరిశర్మ, రామగిరిశర్మ, రాజేశ్వరశర్మ, సిద్దెశ్‌ల ఆధ్వర్యంలో మాత భువనేశ్వరీదేవితో స్వామి వారి కల్యాణం కనులపండువగా జరిపారు. వేకువజామున వీరభద్ర స్వామి ఆలయం వద్ద తమ కొర్కెలు నెరవేరాలని భక్తులు అగ్నిగుండాలను తొక్కారు. ఆలయం ప్రధాన మండపంలో దక్షయజ్ఞం జరిపించారు. తదుపరి బాజభజంత్రీలతో ఆలయ పీఠాధిపతి సదాశివమహంత్ ఆలయం నుంచి శ్రీసిద్దగిరి సమాధి వద్దకు వచ్చి అక్కడ పూజా కార్యక్రమాలను నిర్వహించి కాషాయపతాకాన్ని ఎగురవేశారు. భక్తులకు హైకోర్టు న్యాయవా ది పెద్దబచ్చగారి రాంరెడ్డి–కృష్ణవేణి దంపతులు అన్నదానం చేశారు. ఈకార్యక్రమంలో దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషన్ శ్రీరాం రవీందర్, ఈవో శ్రీధర్‌తో, ఆలయ పునర్‌నిర్మాణకమిటీ చైర్మన్ అందే మహేందర్‌రెడ్డి, ఉత్సవ కమిటీ చైర్మన్ లింబాద్రి, మాజీ ఎంపీపీలు బల్యాల రేఖ సుదర్శన్, గాలిరెడ్డి, మాజీ సర్పంచ్‌లు నర్సింహరెడ్డి, తున్కివేణు, తదితరులు పాల్గొన్నారు.
భారీగా తరలివచ్చిన భక్తులు
భక్తి శ్రద్ధ్దలతో అగ్నిగుండాలు,
కాషాయ పతాకావిష్కరణ
వైభవంగా సిద్దరామేశ్వరస్వామి కల్యాణం
వైభవంగా సిద్దరామేశ్వరస్వామి కల్యాణం