ఉత్సాహంగా రాష్ట్రస్థాయి పోటీల ప్రారంభం
అమలాపురం రూరల్: రాష్ట్రస్థాయి సెపక్‌తక్రా క్రీడల్లో జిల్లా మహిళా క్రీడాకారులు సత్తా చాటి సెమీ ఫైనల్స్‌కు చేరారు. స్థానిక ఎస్‌కేబీఆర్ కళాశాలలో 36వ సీనియర్ అంతర్ జిల్లాల మెన్ అండ్ ఉమెన్ సెపక్‌తక్రా పోటీలను ఎంపీ హరీష్‌మాధుర్ శనివారం ప్రారంభించారు. రెండు రోజుల పాటు జరిగే ఈ పోటీల్లో సుమారు 20 జిల్లాల నుంచి 250 మంది పాల్గొన్నారు. తొలిరోజు కోనసీమతో పాటు అనంతపురం, కృష్ణా జిల్లాల మహిళా జట్లు సెమీ ఫైనల్స్‌కు చేరాయి. పురుషుల విభాగంలో కర్నూలు, తూర్పుగోదావరి, కోనసీమ, ఒంగోలు జిల్లాల జట్లు క్వార్టర్ ఫైనల్స్‌కు చేరుకున్నాయి. తొలి దశ లీగ్ పోటీలు హోరాహోరీగా సాగాయి. తొలిరోజు పురుషుల విభాగంలో 22 మ్యాచ్‌లు, మహిళల విభాగంలో 18 మ్యాచ్‌లు జరిగినట్లు సెపక్‌తక్రా జిల్లా అధ్యక్షుడు జవ్వాది తాతబాబు, టోర్నమెంట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ యండ్ర గౌతమ్ తెలిపారు. కార్యక్రమంలో ఎస్‌కేబీఆర్ కళాశాల పాలకవర్గ అధ్యక్షుడు ఎన్. సుబ్బరాజు, ప్రతినిధి టీఎస్‌ఎన్ రాజు, వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి చెల్లుబోయిన శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
బీచ్ ఫుట్‌బాల్ పోటీలు ప్రారంభం
చీరాల రూరల్: ఆంధ్రప్రదేశ్ ఫుట్‌బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చీరాల రామాపురం బీచ్‌లో ఏపీ అంతర్ జిల్లా బీచ్ ఫుట్‌బాల్ చాంపియన్ షిప్ పోటీలు శుక్రవారం రాత్రి అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. రాష్ట్ర ఫుట్‌బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు, మాజీ ఎంపీ కోటగిరి శ్రీధర్, స్థానిక ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య ప్రారంభించిన పోటీల్లో 17 జిల్లాల క్రీడాకారులు హాజరైనట్లు పోటీల నిర్వాహకుడు, నాలుగు జిల్లాల నల్లమల జోన్ ఇన్‌చార్జి నూతలపాటి దేవదాసు తెలిపారు. ఫ్లడ్‌లైట్ల వెలుగులలో నిర్వహించిన పోటీల్లో రెండు మ్యాచ్‌లు డ్రాగా ముగిశాయి. పోటీల్లో ఎన్‌టీఆర్ జిల్లా జట్టు 2–1 తేడాతో తూర్పు గోదావరి జట్టుపై గెలవగా, కాకినాడ జిల్లా జట్టు 2–1 తేడాతో శ్రీకాకుళం జట్టుపై గెలిచింది. అలాగే కృష్ణాజిల్లా, అంబేడ్కర్ కోనసీమ జిల్లా జట్ల మధ్య జరిగిన మ్యాచ్ డ్రాగా ముగిసింది. పోటీలను ఆర్గనైజర్ నూతలపాటి దేవదాసు, నూతలపాటి విజయ్ కుమార్ తదితరులు పర్యవేక్షించారు.


