కౌలు రైతు మృతి | - | Sakshi
Sakshi News home page

కౌలు రైతు మృతి

Oct 3 2026 12:20 AM | Updated on Oct 3 2026 12:20 AM

కె.గంగవరం: పొలంలో పురుగు మందు పిచికారీ చేస్తూ అస్వస్థతకు గురై కౌలు రైతు ప్రాణాలు కోల్పోయిన ఘటన కె.గంగవరం మండలంలో చోటుచేసుకుంది. అముజూరుకు చెందిన గెద్దాడ సతీష్‌ ఆటో నడుపుకొంటూ కొద్దిపాటి భూమి కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తున్నాడు. శుక్రవారం పొలంలో పురుగు మందు పిచికారీ చేస్తూ ఉండగా ఒక్కసారిగా స్పృహతప్పి పడిపోయాడు. స్థానికులు గమనించి రామచంద్రపురం ఏరియా ఆసుపత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు ధ్రువీకరించారు. ఎస్సై గుబ్బల సోమేంద్ర ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు. గెద్దాడ సతీష్‌ వైఎస్సార్‌ సీపీలో ఉన్నారు. ఆయన మరణ వార్త విని పార్టీ నియోజకవర్గ కోఆర్డినేటర్‌ పిల్లి సూర్యప్రకాశ్‌ ఏరియా ఆసుపత్రికి చేరుకుని సతీష్‌ భౌతిక కాయానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. సతీష్‌కి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement