పారిపోతుండగా పట్టుబడ్డారు! | - | Sakshi
Sakshi News home page

పారిపోతుండగా పట్టుబడ్డారు!

Oct 3 2026 12:20 AM | Updated on Oct 3 2026 12:20 AM

● 30 కిలోల గంజాయితో ఆరుగురి అరెస్ట్‌

● పోలీసుల నుంచి

తప్పించుకునేందుకు యత్నించిన వైనం

అడ్డతీగల: పోలీసులను చూసి పారిపోయేందుకు ప్రయత్నించారు.. చివరికి గంజాయితో పట్టుబడి కటకటాల పాలయ్యారు. అడ్డతీగల మండలం వేటమామిడి వద్ద వాహన తనిఖీల్లో భాగంగా 30 కిలోల గంజాయితో ఆరుగురిని అరెస్ట్‌ చేసినట్లు రంపచోడవరం డీఎస్పీ అష్రఫ్‌ అలీ శుక్రవారం తెలిపారు. ఈ గంజాయి విలువ రూ.1.50 లక్షలు ఉంటుందని అన్నారు. ఆయన తెలిపిన కథనం ప్రకారం.. గంజాయి రవాణా జరుగుతుందన్న సమాచారం మేరకు గురువారం మధ్యాహ్నం అడ్డతీగల మండలం వేటమామిడి జంక్షన్‌లో సీఐ గజేంద్రకుమార్‌, ఎస్సై వినోద్‌ ఆధ్వర్యంలో సిబ్బంది వాహన తనిఖీలు నిర్వహించారు. వై.రామవరం వైపు నుంచి వస్తున్న రెండు మోటార్‌ సైకిళ్లు, ఓ కారులో వస్తున్న వ్యక్తులు పోలీసు తనిఖీలను గమనించి, వాహనాలను వెనక్కి తిప్పి పారిపోవడానికి ప్రయత్నించారు. అప్రమత్తమైన పోలీసులు ఆ వాహనాల్లో ఉన్న ఆరుగురిని అదుపులోకి తీసుకోగా అరవింద్‌ అనే వ్యక్తి తన వద్ద ఉన్న గంజాయి ఉంచిన బ్యాగ్‌ను పడేసి అడవిలోకి పారిపోయాడు. వాహనాల్లో తనిఖీలు నిర్వహించగా కారు డిక్కీలో, మోటార్‌ సైకిళ్లపై ఉంచిన బ్యాగుల్లో 30 కిలోల గంజాయి పట్టుబడింది. గంజాయి రవాణా చేస్తున్న సునీల్‌ కృష్ణ, చెల్లి సుభాష్‌ మణికంఠ, షేక్‌ షాయిదా, భరత్‌ పుష్పరాజ్‌, గురుప్రసాద్‌ రాము, నాందేటి సందేశ్‌లను అరెస్ట్‌ చేయగా అరవింద్‌తో పాటు ఈ గంజాయి రవాణాతో సంబంధం ఉన్న మున్నా పరారీలో ఉన్నారన్నారు. గంజాయి రవాణాకు ఉపయోగించిన కారు, రెండు మోటార్‌ సైకిళ్లు, నాలుగు మొబైల్‌ ఫోన్లు సీజ్‌ చేశామన్నారు.

నేర నేపథ్యం ఇదీ..

కర్ణాటకకు చెందిన సునీల్‌ కృష్ణ, భరత్‌ పుష్పరాజ్‌, గురుప్రసాద్‌ రాము కలసి కృష్ణా జిల్లాకు చెందిన నాందేటి సందేశ్‌, షేక్‌ షాయిదా, సుభాష్‌ మణికంఠల సహాయంతో అల్లూరి జిల్లా గూడెంకొత్తవీధి మండలం ధారకొండ ప్రాంతంలోని మున్నా అనే వ్యక్తి వద్ద రూ.30 వేలకు 30 కిలోల గంజాయి కొనుగోలు చేశారు. ఈ గంజాయిని బెంగళూరు, విజయవాడ ప్రాంతాల్లో ఎక్కువ ధరకు విక్రయించి సొమ్ము చేసుకోవడానికి పథక రచన చేయగా, పోలీసుల వ్యూహంలో చిక్కుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement