భార్యను వేధిస్తున్న వ్యక్తి హత్య | - | Sakshi
Sakshi News home page

భార్యను వేధిస్తున్న వ్యక్తి హత్య

Aug 19 2026 12:12 AM | Updated on Aug 19 2026 12:12 AM

కత్తితో నరికి చంపిన భర్త

శృంగధార గ్రామంలో ఘటన

శంఖవరం: మండలంలోని పెద మల్లాపురం పంచాయతీ పరిధిలోని శృంగధారలో ఒక వ్యక్తి హత్యకు గురైన సంఘటన మంగళవారం చోటుచేసుకుంది. తన భార్యను వేధిస్తున్నాడనే కారణంతో రాజవొమ్మంగి మండలం వాతంగి పంచాయతీ ఓంపాలెం గ్రామానికి చెందిన ఎస్‌.మణికుమార్‌ (32)ను కాకూరి చంద్రయ్య కత్తితో నరికి హత్య చేశాడు. వీరిద్దరూ సమీప బంధువులు కావడం విశేషం. వివరాల్లోకి వెళితే.. గతంలో శృంగధారలో చంద్రయ్య భార్యతో మణికుమార్‌ వివాహేతర సంబంధం పెట్టుకున్నాడనే ఆరోపణలు ఉన్నాయి. అయితే ఆమె మణికుమార్‌ను వదిలించుకుని భర్తతో ఉండసాగింది. దీంతో అతడు నాటు తుపాకీతో చంద్రయ్య, అతడి భార్యను కాల్చాడు. అప్పుడు పోలీసులు మణికుమార్‌పై కేసు నమోదు చేసి జైలుకు పంపారు. జైలు నుంచి తిరిగి వచ్చిన తర్వాత ఆ మహిళను వేధింపులకు గురి చేశాడు. దీంతో మణికుమార్‌పై కాకూరి చంద్రయ్య కత్తితో దాడి చేయడంతో మృతి చెందాడు. ఈ నేపథ్యంలో నిందితుడిని అన్నవరం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ప్రత్తిపాడు సీహెచ్‌సీకి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సైశ్రీహరిబాబు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement