ఆత్రేయపురం: కాటన్ బ్యారేజీ సమీపంలోని పిచ్చుక లంకలో తలపెట్టిన టూరిజం ప్రాజెక్టు ఒక్క అడుగు ముందుకు కదలడం లేదు. దశాబ్దాల తరబడి పనులు జరగకపోవడంతో ప్రజలు నిరాశ చెందుతున్నారు. తెలుగుదేశం పాలనలో 1988 ఏప్రిల్ 20న పిచ్చుక లంక రక్షకాభివృద్ధి పథకానికి శంకుస్థాపన జరిగింది. అప్పటి నుంచి ఎక్కడి వేసిన గొంగళి అక్కడే ఉందని చందంగా మారింది. దాదాపు 38 ఏళ్ల క్రితం ఎలా ఉందో ఇప్పుడు కూడా అలాగే ఉంది. రాజమహేంద్రవరం ప్రజలతో పాటు ఉభయ గోదావరి జిల్లాల ప్రజలకు ఇది ఆహ్లాదకరంగా, ఉపయోగకరంగా ఉంటుందని, పర్యాటకంగా ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని భావించారు. రాబోయే పుష్కరాలు నాటికై నా ఇక్కడ టూరిస్ట్ ప్రాజెక్టు అభివృద్ధి చేస్తారని ప్రజలు ఆశగా ఎదురు చూస్తున్నారు. ఎంతో ఆర్భాటంగా శంకుస్థాపన చేసిన ఈ ప్రాజెక్టు పనులు దాదాపు ముందుకు కదల్లేదనే చెప్పాలి. మధ్యలో కొద్దిగా మెరక చేసి వదిలేయడం మినహా ఈ ప్రాజెక్టు అభివృద్ధికి ఏమాత్రం పనులు చేపట్టలేదు. కనీసం చుట్టూ రక్షణ గోడను సైతం నిర్మించకపోవడం దారుణం.
ఉపన్యాసాలే తప్ప..
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు కావస్తోంది. రాజమహేంద్రవరానికి కూత వేటు దూరంలోనే రాష్ట్ర టూరిజం శాఖ మంత్రి కందుల దుర్గేష్ ఉంటున్నారు. ఆయనతో పాటు కూటమి నాయకులందరూ పిచ్చుకలంక అభివృద్ధిపై ఉపన్యాసాలు ఇస్తున్నారే తప్ప, ఆచరణలో చూపడం లేదు. పిచ్చుకలంకలో టూరిజం ప్రాజెక్టు వస్తే ఈ ప్రాంతంలో ఉపాధి అవకాశాలు కలుగుతాయని స్థానిక యువత భావించారు. కానీ ఆ ఆశలన్నీ ఎండమావులుగా మారాయి.
అధ్వానంగా..
ప్రస్తుతం పిచ్చుకలంకలో ముళ్ల పొదలు, పిచ్చి మొక్కలు పెరిగిపోయాయి. గతంలో టీడీపీ పాలనలో పిచ్చుకలంకలో వ్యవసాయ పరిశోధనా స్థానం నిర్మాణానికి సైతం శంకుస్థాపన శిలాఫలకం వేశారు. ఆ పనులకు ఇంతవరకు అతీగతీ లేదు. శిలాఫలకం ఆచూకీ కూడా దొరకడం లేదు. పైగా ఈ ప్రాంతంలో కొందరు దేశం నాయకులు బినామీలుగా అరటి తోటలు సాగు చేసుకుంటూ లబ్ధి పొందుతున్నాని సమాచారం. రాబోయే పుష్కరాల నాటికై నా పిచ్చుకలంక టూరిజం అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
పిచ్చుక లంక టూరిజం
ప్రాజెక్టు కోసం కేటాయించిన ప్రాంతం
{´ëgñæMýS$t MøçÜ… 1988ÌZ ˘
ఆవిష్కరించిన శిలాఫలకం
ఫ కలగా మిగిలిన పిచ్చుకలంక
టూరిజం ప్రాజెక్టు
ఫ ముందుకు కదలని పనులు
ఫ గతంలో టీడీపీ
ప్రభుత్వ హయాంలో శంకుస్థాపన
ఫ ఏళ్ల తరబడి ప్రజల ఎదురుచూపులు
ఫ పట్టించుకోని పాలకులు


