అల్లుకున్న నిర్లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

అల్లుకున్న నిర్లక్ష్యం

Jul 1 2026 12:28 AM | Updated on Jul 1 2026 12:28 AM

పెద్దాపురం/కొత్తపల్లి: విద్యుత్‌ స్తంభాలను పిచ్చి పాదులు అల్లుకుపోవడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. దీని వల్ల సరఫరాకు ఆటంకం కలగడంతో పాటు పశువులు ఆకులను తీనే సమయంలో షాక్‌కు గురయ్యే ప్రమాదం ఉందన్నారు. వర్షం పడితే విద్యుత్‌ తీగల నుంచి నిప్పులు రాలుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు. పెద్దాపురం మండలం దివిలి నుంచి రాజుపాలెం వెళ్లే ఆర్‌అండ్‌బీ రోడ్డు పొడవునా విద్యుత్తు స్తంభాలకు పిచ్చి పాదులు దర్శనమిస్తున్నాయి. అలాగే కొత్తపల్లి మండలం కొమరగిరి సెంటర్‌లోని గోర్స శ్మశాన వాటిక వద్ద ఉన్న విద్యుత్‌ స్తంభానికి పాదులు అల్లుకుపోయాయి. కొత్తపల్లి పోలీస్‌ స్టేషన్‌ వెనుక విద్యుత్‌ స్తంభానికి పాకేశాయి.

కొత్తపల్లి పోలీస్‌ స్టేషన్‌ వెనుక పరిస్థితి

కొత్తపల్లి మండలం కొమరగిరి సెంటర్‌లో..

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement