
ఎందరికో ఉపాధి
ఏటా సీజనల్‌గా లభ్యమయ్యే మామిడి కాయలను కొనుగోలు చేసి తాండ్ర తయారీకి వినియోగిస్తున్నాం. ఏడాదికి సరిపడేలా జ్యూస్ నిల్వ ఉంచుకుంటున్నాం. ఒక్కో పరిశ్రమలో వంద మందికి పైగా ఉపాధి పొందుతున్నారు. మగవారికి రూ.800 నుంచి రూ.900 వరకు, ఆడవారికి రూ.600 వరకూ కూలి ఇస్తున్నాం. తాండ్ర ధర ప్రస్తుతం కిలో రూ.80 నుంచి రూ.100 వరకూ ఉంది. తాండ్ర తయారీ ద్వారా కూలీలకు ఉపాధి కల్పిస్తున్నామనే సంతృప్తి ఉంది.
– వలవల వెంకటేశ్వరరావు,
తాండ్ర తయారీదారుడు, పండూరు