పట్టించుకునే నాథుడే లేరు.. | - | Sakshi
Sakshi News home page

పట్టించుకునే నాథుడే లేరు..

Nov 10 2026 12:43 AM | Updated on Nov 10 2026 12:43 AM

మా 37వ వార్డులో రోజుల తరబడి డ్రెయినేజీలు శుభ్రం చేయకపోవడంతో మురుగునీరు రోడ్లపై పారుతోంది. దీంతో దోమలు, పందులు అందులో చేరి స్వైరవిహారం చేస్తున్నాయి. తీవ్రమైన దుర్వాసనతో చుట్టుపక్కల వారు ఇబ్బందులు పడుతున్నాయి. దీని గురించి పట్టించుకునే నాథుడే లేకుండాపోయారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలి. – నవీన్‌, గద్వాల

ముక్కు మూసుకోవాలి..

అయిజ పట్టణంలోని పశువుల దవాఖానా వద్ద ఉన్న పెద్దవాగులో మురుగు పొంగిపొర్లుతుంది. దుర్వాసన వస్తుండడంతో అటువైపు వెళ్లాలంటే ముక్కు మూసుకుని వెళ్లాలి. చాలా రోజుల నుంచి పారిశుద్ధ్య చర్యలు చేపట్టకపోవడంతో ఈ పరిస్థితి నెలకొంది. అధికారులు స్పందించి పారిశుద్ధ్య చర్యలు చేపట్టడంతోపాటు ఇతరత్రా సమస్యలను పరిష్కరించాలి.

– నజీర్‌, అయిజ

రోడ్లపై మురుగు..

కొత్తగా ఏర్పడిన వడ్డేపల్లి మున్సిపాలిటీలో సరైన డ్రెయినేజీ వ్యవస్థ లేకపో వడంతో మురుగు నీరు మొత్తం రోడ్లపైనే పారుతుంది. దీనికి తోడు అంతర్గత రహదారులు నిర్మించకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుంది. దీనిపై అధికారులకు విన్నవించినా పట్టించుకోవడం లేదు. మురుగు వల్ల చిన్నారులు, వృద్ధులు రోగాల బారిన పడుతున్నారు. – కల్యాణ్‌, వడ్డేపల్లి

చర్యలు తీసుకుంటాం..

మున్సిపాలిటీల్లో రోజువారిగా పారిశుద్ధ్య పనులు చేయాలి. నెలల తరబడి డ్రెయినేజీలు క్లీన్‌ చేయకుండా ఉండటం సరైంది కాదు. దీనిపై సంబంధిత అధికారులతో మాట్లాడి.. క్రమం తప్పకుండా పారిశుద్ధ్యం పనులు, కనీస సదుపాయాలు కల్పించేలా చూస్తాం. అలాగే గద్వాల కమిషనర్‌ తీరు మార్చుకోవాలని చాలాసార్లు చెప్పాం. జిల్లాకేంద్రంలో అన్ని సమస్యలు పరిష్కరించేలా కృషిచేస్తాం.

– నర్సింగరావు, అదనపు కలెక్టర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement