దసరా సంబరం | - | Sakshi
Sakshi News home page

దసరా సంబరం

Oct 20 2026 1:44 AM | Updated on Oct 20 2026 1:44 AM

విజయదశమి.. చెడుపై విజయం సాధించినందుకు చిహ్నంగా నిర్వహిస్తారు. ఈ సందర్భంగా తొమ్మిది రోజులపాటు అమ్మవారికి ప్రత్యేక ఉత్సవాలు జరుపుతారు. రోజుకో అవతారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారు. ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా తమ సంప్రదాయ రీతిలో ఉత్సవాలు నిర్వహిస్తారు. ఇప్పటికే నవరాత్రుల సందడితో జిల్లావ్యాప్తంగా ఆధ్యాత్మిక వాతావరణం వెల్లివిరియగా.. మంగళవారం దసరాను ఆనందోత్సవాల మధ్య జరుపుకోవడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు.

– గద్వాల న్యూటౌన్‌

ఆలయాల్లో

ప్రత్యేక ఏర్పాట్లు..

దసరాను పుస్కరించుకొని స్థానిక గుంటి చెన్నకేశవస్వామి ఆలయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. పండుగ రోజు ప్రజలు ఆలయానికి వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు. ఆలయ ప్రాంగణంలో ఉన్న శమీవృక్షం కట్టను ముస్తాబు చేశారు. ప్రజలు శమీవృక్షం చుట్టూ ప్రదక్షిణలు చేసి మొక్కులు తీర్చుకుంటారు. ఈ క్రమంలో మున్సిపల్‌ అధికారులతోపాటు ఆలయ నిర్వాహకులు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా ఏర్పాట్లు చేశారు. సంతాన వేణుగోపాలస్వామి, గంటవీధి ఆలయంలో శమీవృక్షం వద్ద ప్రత్యేక పూజలు జరగనున్నాయి. జిల్లాకేంద్రంలో పలుచోట్ల ప్రతిష్టించిన అమ్మవారి విగ్రహాలను పండుగ రోజు నిమజ్జనం చేయనున్నారు. ఈ సందర్భంగా అమ్మవారి విగ్రహాలను ఊరేగింపుగా గుంటి చెన్నకేశవస్వామి ఆలయానికి తీసుకొచ్చి ప్రత్యేక పూజలు చేయడం ఆనవాయితీగా వస్తోంది.

దసరాను పురస్కరించుకుని జిల్లావ్యాప్తంగా పండుగ సందడి నెలకొంది. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా భావించే విజయదశమి పర్వదినాన్ని ప్రజలు భక్తిశ్రద్ధలతో, ఉత్సాహంగా జరుపుకోవడానికి ఆలయాలను విద్యుద్దీపాలతో ముస్తాబు చేస్తున్నారు. దసరా రోజున శమీ చెట్టుకు పూజ చేయడం ప్రత్యేకత. ఈ చెట్టును పూజించడం లక్ష్మీప్రదమని పురాణాలు చెబుతున్నాయి. అలాగే రాష్ట్ర పక్షిగా గుర్తింపు పొందిన పాలపిట్టను దసరా రోజున చూడడాన్ని అదృష్టంగా, శుభసూచికంగా భావిస్తారు. ఈ క్రమంలో గ్రామ, గ్రామాన ప్రత్యేకంగా శమీ వృక్షాన్ని ప్రతిష్టించి.. బాజాభజంత్రీలతో ఊరేగింపుగా వెళ్లి చెట్టును పూజించి.. శమీ ప్రతిని తెచ్చుకొని ఒకరికొకరు అందించుకొని పండుగ శుభాకాంక్షలు చెప్పుకొంటారు. ఖరీఫ్‌ సీజన్‌ ముగింపు కావడంతో దసరా నాటికి కొత్త ధాన్యం ఇంటికి చేరుతుంది. ఇలా కొత్త ధాన్యంతో దేవతలకు నైవేద్యం సమర్పించడం ఆనవాయితీ. కొందరు ప్రత్యేకంగా వాహనాలకు, యంత్రాలకు, వ్యవసా య పరికరాలకు ప్రత్యేకంగా ఆయుధపూజ నిర్వహిస్తారు.

పాలపిట్ట దర్శనం..

దసరా రాష్ట్ర ప్రజలు జరుపుకొనే అతిపెద్ద పండుగ. ఇంటిల్లిపాది నూతన దుస్తులు ధరించి రకరకాల పిండి పదార్థాలు, నాన్‌ వెజ్‌ వంటకాలతో ఆనందంగా గడిపిస్తారు. అంతా కలిసి బ్యాండుమేళాలతో వెళ్లి పాలపిట్టను చూసి విజయోత్సాహంతో కేరింతలు కొడతారు. అక్కడి నుంచి నేరుగా జమ్మి చెట్టు దగ్గరకు వెళ్లి పూజలు చేసి.. కష్టాలు, పాపాలు తొలగిపోవాలని కోరుకుంటారు. జమ్మి పత్రిని (దీనిని బంగారంగా భావిస్తారు) దేవతలకు సమర్పించి ఆ తర్వాత ఒకరినొకరు జమ్మి ఆకు చేతిలో పెట్టుకొని ఆలింగనం చేసుకుంటారు. పిల్లలైతే పెద్దల చేతుల్లో జమ్మి ఆకు పెట్టి పాదాభివందనం చేస్తారు. ఈ చర్యను మనషుల మధ్య కల్మషాన్ని పారద్రోలి ప్రేమ, ఆప్యాయత, అనురాగాలను పెంచేదిగా భావిస్తారు.

పల్లెల్లో మొదలైన పండుగ వాతావరణం

సొంతూళ్లకు తరలివచ్చిన కుటుంబాలు, బంధుమిత్రులు

ప్రత్యేకంగా నిలవనున్న పాలపిట్ట దర్శనం

జములమ్మ అమ్మవారి

తెప్పోత్సవానికి ఏర్పాట్లు పూర్తి

జిల్లాలో నేడు విజయదశమి వేడుకలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement