జిల్లా ప్రిన్సిపల్‌ జడ్జి పూజలు | - | Sakshi
Sakshi News home page

జిల్లా ప్రిన్సిపల్‌ జడ్జి పూజలు

Oct 20 2026 1:44 AM | Updated on Oct 20 2026 1:44 AM

అలంపూర్‌: పట్టణంలోని జోగుళాంబదేవి, బాలబ్రహ్మేశ్వరస్వామి ఆలయాలను జిల్లా ప్రిన్సిపల్‌ సెషన్‌ కోర్టు జడ్జి ప్రేమలత, స్థానిక జూనియర్‌ సివిల్‌ కోర్టు జడ్జి మిథున్‌ తేజతో కలిసి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వారికి ఆలయ ఈఓ దీప్తి అర్చకులతో కలిసి స్వాగతం పలికారు. ముందుగా జిల్లా ప్రిన్సిపల్‌ సెషన్‌ కోర్టు జడ్జి బాలబ్రహ్మేశ్వరస్వామి, జోగుళాంబ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం వారికి అర్చకులు తీర్థప్రసాదాలు అందజేసి ఆశీర్వచనం పలికారు. అలాగే అలంపూర్‌ క్షేత్ర ఆలయాలను ప్రముఖులు సందర్శించారు. ఈ సందర్భంగా రాష్ట్ర మాజీ సీఎస్‌ పీకే మహంతి, దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే సీతాదయాకర్‌రెడ్డి దర్శించుకొని పూజలు చేశారు.

ప్రభుత్వ అసమర్థతతో రైతులకు కరెంటు కష్టాలు

వనపర్తి రూరల్‌: కాంగ్రెస్‌ ప్రభుత్వ అసమర్థత, అస్తవ్యస్థ విద్యుత్‌ సరఫరా కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి విమర్శించారు. సోమవారం వనపర్తి మండలం పెద్దగూడెం తండాలో విద్యుత్‌ కోతలతో ఎండిన వరిపంటను బీఆర్‌ఎస్‌ నాయకులు, రైతులతో కలిసి ఆయన పరిశీలించారు. పంటలు ఎండిపోవడంతో గిరిజన రైతులు పడుతున్న కష్టాలను అడిగి తెలుసుకున్నారు. పెద్దగూడెం తండాలో సుమారు 150 ఎకరాల వరిపంట ఎండిపోయినట్లు రైతులు ఆయనకు వివరించారు. ఎకరాకు రూ.25వేల వరకు పెట్టుబడి పెట్టామని.. ఏపుగా పెరిగిన పంట విద్యుత్‌ కోతల కారణంగా కళ్ల ముందే ఎండిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం మాజీ మంత్రి మాట్లాడుతూ.. ఇది పకృతి తెచ్చిన కరువు కాదని, కాంగ్రెస్‌ ప్రభుత్వం తెచ్చిన కరువు అని విమర్శించారు. పంటలు నష్టపోయిన రైతుల పరిస్థితిపై రాష్ట్రవ్యాప్తంగా సమీక్ష నిర్వహించి, బాధితులకు తక్షణమే నష్టపరిహారం అందించాలని ఆయన డిమాండ్‌ చేశారు. నీటి వనరులు అందుబాటులో ఉన్నప్పటికీ ప్రభుత్వం సక్రమంగా విద్యుత్‌ సరఫరా చేయడంలో విఫలమైందని ఆరోపించారు. గిరిజన రైతులు సాగుచేసుకుంటున్న భూములపై హక్కులు కల్పించేందుకు గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం 96 మందికి పట్టాలు ఇచ్చిందని, మరో 56 మందికి పట్టాలు ఇవ్వాల్సి ఉన్నా ప్రస్తుత ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement