ఎర్రవల్లి: మండలంలోని షేక్‌పల్లి గ్రామంలో సోమవారం సర్పంచ్ వెంకటలక్ష్మమ్మ ఆధ్వర్యంలో సద్దుల బతుకమ్మ వైభవంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే విజయుడు హాజరై దుర్గమ్మను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా గ్రామంలోని ప్రతి ఇంటి నుంచి రంగురంగుల పూలతో తయారు చేసిన బతుకమ్మలను ఎమ్మెల్యేతో కలిసి మహిళలు, చిన్నారులు డప్పు వాయిద్యాల నడుమ ఊరేగింపుగా దుర్గమ్మ దగ్గరికి తీసుకువచ్చారు. బతుకమ్మల ముందు గౌరవిస్తూ.. కీర్తిస్తూ.. పాటలు పాడుతూ బొడ్డెమ్మ వేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ ఏటా పాడి పంటలు బాగా పండి రైతులకు లాభాలు రావాలని కోరుకున్నారు. అదేవిధంగా ప్రజలంతా సుఖసంతోషాలతో జీవించాలని బతుకమ్మను వేడుకొని ప్రజలకు దసరా పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ రంగారెడ్డి, నాయకులు హన్మంతురెడ్డి, రవీందర్‌రెడ్డి, శ్రీధర్‌రెడ్డి, మహేశ్వర్‌రెడ్డి, భీమేశ్వరెడ్డి తదితరులు పాల్గొన్నారు.


