ప్రశాంతంగా మహాత్ముడి విగ్రహావిష్కరణ | - | Sakshi
Sakshi News home page

ప్రశాంతంగా మహాత్ముడి విగ్రహావిష్కరణ

Oct 3 2026 12:44 AM | Updated on Oct 3 2026 12:44 AM

అలంపూర్‌: జాతిపిత మహాత్మాగాంధీ విగ్రహావిష్కరణ కార్యక్రమం ప్రశాంత వాతావరణంలో జరిగింది. శుక్రవారం అలంపూర్‌ మున్సిపాలిటీలో మహాత్మాగాంధీ జయంతిని పురస్కరించుకొని పోలీసుల పహారాలో మున్సిపల్‌ కమిషనర్‌ నూతన విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాల నాయకులు జాతిపితకు పూలమాల వేసి నివాళులర్పించారు. పోలీసుల భారీ భద్రత మధ్య నూతన విగ్రహాన్ని ఆవిష్కరించారు. మున్సిపాలిటీలోని ప్రధాన రహదారిలో డివైడర్‌ నిర్మాణం చేపట్టగా.. గాంధీచౌక్‌లోని పాత విగ్రహం రాకపోకలకు ఇబ్బందిగా ఉందని ఇటీవలే తొలగించారు. ఈ క్రమంలో మున్సిపల్‌ అధికారులు గత నెల 30న అర్ధరాత్రి దాతల సహకారంతో ఏర్పాటు చేసిన విగ్రహాన్ని తొలగించారు. మరో నూతన విగ్రహాన్ని తీసుకురాగా.. పోలీసులు ఎలాంటి అవాంచనీయ ఘటనలు చోటు చేసుకోకుండా గురువారం పోలీస్‌ పహారా ఏర్పాటు చేశారు. విగ్రహం వద్ద సీసీ కెమెరాలు సైతం ఏర్పాటు చేసి బందోబస్తు నిర్వహించారు. సీఐ ప్రదీప్‌, ఎస్‌ఐ రామకృష్ణ ఆధ్వర్యంలో మహాత్ముడి జయంతి రోజున విగ్రహాన్ని ఆవిష్కరించడంతో కొన్ని రోజులుగా దారి తీసిన ఉద్రిక్తత పరిస్థితులు సద్దుమణిగాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement