క్రీడాకారులు అత్యుత్తమ ప్రతిభకనబర్చాలి | - | Sakshi
Sakshi News home page

క్రీడాకారులు అత్యుత్తమ ప్రతిభకనబర్చాలి

Oct 3 2026 12:44 AM | Updated on Oct 3 2026 12:44 AM

గద్వాల న్యూటౌన్‌: రాష్ట్రస్థాయిలో జరిగే కబడ్డీ పోటీల్లో జిల్లా క్రీడాకారులు అత్యుత్తమ ప్రతిభకనబర్చి జిల్లాకు మంచిపేరు తీసుకురావాలని బీజేపీ రాష్ట్ర కౌన్సిల్‌ సభ్యుడు బండల వెంకట్రాములు అన్నారు. ఈ నెల 10 నుంచి 12 వరకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో రాష్ట్రస్థాయి జూనియర్‌ బాలికల కబడ్డీ టోర్నీ నిర్వహించనున్నారు. ఇందుకోసం శుక్రవారం స్థానిక ఇండోర్‌ స్టేడియంలో జిల్లాస్థాయి సెలక్షన్స్‌ ట్రయల్స్‌ నిర్వహించగా.. 70 మంది క్రీడాకారిణులు పాల్గొనగా 14 మందిని ఎంపిక చేశారు. ఈ సందర్భంగా ఆయన క్రీడాకారులను పరిచయం చేసుకొని మాట్లాడారు. క్రీడల్లో రాణించేందుకు పట్టుదల, క్రమశిక్షణ, నిరంతర సాధన ఎంతో అవసరం అన్నారు. క్రీడాకారులకు అన్ని విధాలుగా ప్రోత్సాహం అందిస్తూ, వారి ప్రతిభను వెలికితీసేందుకు జిల్లా కబడ్డీ అసోసియేషన్‌ కృషిచేస్తుందన్నారు. కార్యక్రమంలో ఇండోర్‌ స్టేడియం ఇన్‌చార్జి బషీర్‌, కబడ్డీ అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి నర్సింహ, కోశాధికారి చందు, హేమావతి, పీడీలు స్రవంతి, అరుణతార, రాధ, శివాని, దీప్తి, పీఈటీలు, సీనియర్‌ క్రీడాకారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement