అధికారులు బి.తిమ్మాపూర్ శివారులో సర్వే చేసి వెళ్లారంట. మాకు ముందుగా నోటీసులు ఇవ్వలేదు. సర్వే చేసినట్లు పక్క రైతులు తెలిపారు. సర్వే ఎందుకు చేస్తున్నారో కూడా మాకు అర్థం కాలేదు. మేము ఉన్నప్పుడు మళ్లీ సర్వే చేయాలని కోరుతున్నాం.
– ఆంజనేయులు, రైతు, బి.తిమ్మాపూర్
ఎండాకాలంలో చేయాలి..
ప్రభుత్వ చేస్తున్న సర్వే మంచిదే. ఇప్పుడు పనుల కాలం కాబట్టి రైతులు పొలం పనుల్లో మునిగిపోయి సర్వే చేసే పొలానికి రాలేకపోతున్నారు. చాలామందికి రీ సర్వే అంటే ఏమిటో కూడా తెలియడం లేదు. అవగాహన కల్పించి.. వేసవికాలం సర్వే చేస్తే బాగుంటుంది.
– శాంతకుమార్, రైతు, ఎక్లాస్‌పురం
సకాలంలో పూర్తిచేస్తాం..
జిల్లాలోని మొత్తం 70 రెవెన్యూ గ్రామాల్లో భూ రీ సర్వే పనులు చేపట్టాం. మొదటిసారి కాబట్టి కొన్ని అవాంతరాలు ఎదురవుతున్నాయి. ఒక్కొక్క సమస్యను పరిష్కరించుకొని రీ సర్వే పనులు సకాలంలో పూర్తిచేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం.
– నూకరాజు, సర్వే ల్యాండ్ ఏడీ
●


