పైలెట్ ప్రాజెక్ట్‌గా జిల్లాను ఎంపిక చేసి ప్రభుత్వం గొర్రెలు, మేకలు, పొట్టేళ్లకు బీమా పథకాన్ని ప్రవేశపెట్టింది. జీవాలకు బీమా చేయించడం వల్ల పలు ప్రయోజనాలు ఉన్నాయి. ఈ క్రమంలో బీమా పథకంపై జిల్లాలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నాం. పెంపకందారులు బీమా అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.
– వెంకటనారాయణ, జిల్లా పశువైద్య, సంవర్ధక శాఖాధికారి
బీమా చేయించాం..
నాకు 200 జీవాలు ఉన్నాయి. రెండు రోజుల క్రితం రూ.3 వేలు వర్తించేలా 100 జీవాలకు బీమా చేయించాను. జీవాలను మేపడానికి పలు ప్రాంతాలకు వాటిని తీసుకెళ్తాం. ఇలాంటి సందర్భాల్లో ప్రమాదాలు చోటు చేసుకొని.. ఒక్కోసారి రోగాలు వచ్చి మృత్యువాత పడతాయి. బీమా ఉండటం వల్ల ఇలాంటి పరిస్థితులను అధిగమించవచ్చు.
– శివకుమార్, పెంపకందారుడు, క్యాతూరు, అలంపూర్ మండలం
●


