2022– 23, 2024– 25 సీజన్‌లకు సంబంధించి రబీలో కేటాయించిన ధాన్యానికి గాను 11,852 మె.ట., సీఎమ్మార్ బియ్యం ప్రభుత్వానికి రావాల్సి ఉంది. అలాగే 2022– 23లో వానాకాలం సంబంధించి 440.491 మె.ట., 2024– 25లో వానాకాలం సీజన్‌కు గాను 3,814.53 మె.ట., సీఎమ్మార్ బియ్యం రావాలి. అయితే మిల్లర్లకు ఇచ్చిన కాలపరిమితి ముగిసినా ప్రభుత్వానికి సీఎమ్మార్ బియ్యం మాత్రం అప్పగించలేదు. అలాగే 2025– 26 వానాకాలం సీజన్‌కు గాను 1.34 లక్షల మె.ట., సీఎమ్మార్ బియ్యం రావాల్సి ఉండగా కేవలం 35 శాతం మాత్రమే కేటాయించారు.


