ప్రజలు ఓటుహక్కును కాపాడుకోవాలి | - | Sakshi
Sakshi News home page

ప్రజలు ఓటుహక్కును కాపాడుకోవాలి

Sep 29 2026 12:39 AM | Updated on Sep 29 2026 12:39 AM

గద్వాల న్యూటౌన్‌: కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన సర్‌ ప్రక్రియలో అనేక అవకతవకలు, అక్రమాలు చోటుచేసుకుంటున్నాయని డీసీసీ అధ్యక్షుడు రాజీవ్‌రెడ్డి అన్నారు. కేంద్ర ఎన్నికల కమిషనర్‌ జ్ఞానేష్‌కుమార్‌ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ సోమవారం స్థానిక వైఎస్సార్‌ సర్కిల్‌ వద్ద కాంగ్రెస్‌ శ్రేణులు నిరసన కార్యక్రమం నిర్వహించాయి. ఈ సందర్భంగా రాజీవ్‌రెడ్డి మాట్లాడుతూ ఓటుహక్కు ప్రజాస్వామ్యానికి పునాది అని, ఓటుహక్కును కాపాడుకోవడం ప్రతి పౌరుడి బాధ్యత అన్నారు. అలాంటి ఓటుహక్కును ఎన్నికల సంఘం బలహీనపరిచే చర్యలు చేపట్టిందని విమర్శించారు. ప్రజాస్వామ్యంలో అధికారం ప్రజల ఓటుతో వస్తుందని, ఆ ఓటుహక్కును స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా వినియోగించుకునే వాతావరణాన్ని కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘంపై ఉందన్నారు. అక్కడే కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. అనంతరం అక్కడి నుంచి కలెక్టరేట్‌ వరకు భారీ నిరసన ర్యాలీ చేపట్టి అక్కడ మరోసారి ఆందోళన చేశారు. అనంతరం సర్‌ ప్రక్రియ సమగ్రంగా పరిశీలించి, ప్రజల అనుమానాలను నివృత్తి చేసే విధంగా చర్యలు చేపట్టాలని డిమాండ్‌ చేస్తూ అదనపు కలెక్టర్‌ నర్సింగరావుకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ జయలక్ష్మి, వైస్‌ చైర్మన్‌ శంకర్‌, గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ శ్రీనివాసులు, మాజీ చైర్మన్‌ రామన్‌గౌడ్‌, నాయకులు రామేశ్వరమ్మ, కుర్మన్న, మద్దిలేటి, లక్ష్మణ్‌, మధునాయుడు, రవి, నర్సిరెడ్డి, నర్సింగరావు, నరేందర్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement